19, అక్టోబర్ 2024, శనివారం

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ


సాహిత్యం: బేతవోలు రామబ్రహ్మం

సంగీతం: ఉపేంద్ర కుమార్

రాగం: మిశ్ర పహాడి, తాళం: ఆది


అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా…నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా…


విశ్వైకనాథుడే విచ్చేయునంట… విశ్వైకనాథుడే విచ్చేయునంట

నీ ఇంటి ముంగిటా నిలుచుండునంట… నీ ఇంటి ముంగిటా నిలుచుండునంట


అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా…

నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా…


నా తనువునో తల్లి నీ సేవ కొరకు… నా తనువునో తల్లి నీ సేవ కొరకు

అర్పింతునోయమ్మ పై జన్మ వరకు… అర్పింతునోయమ్మ పై జన్మ వరకు…


నా ఒడలి అచలాంశ నీ పురము జేరి… నా ఒడలి అచలాంశ నీ పురము జేరి

నీ పాదముద్రతో నెగడాలి తల్లి… నీ పాదముద్రతో నెగడాలి తల్లి


అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా…

నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా…


నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి… నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి

నీ పాద పద్మాలు కడగాలి తల్లి… నీ పాద పద్మాలు కడగాలి తల్లి…


నా తనువు తేజోంశ నీ గుడికి చేరి… నా తనువు తేజోంశ నీ గుడికి చేరి

నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి… నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి


అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా…

నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా…


నా తనువు మరుదంశ నీ గుడికి చేరి… నా తనువు మరుదంశ నీ గుడికి చేరి

నీ చూపు కొసలలో విసరాలి తల్లి… నీ చూపు కొసలలో విసరాలి తల్లి…


నా తనువు గగనాంశ నీ మనికి జేరి… నా తనువు గగనాంశ నీ మనికి జేరి

నీ నామ గానాలు మోయాలి తల్లి… నీ నామ గానాలు మోయాలి తల్లి…


అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా…

నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా… 

విశ్వైకనాథుడే విచ్చేయునంట… నీ ఇంటి ముంగిటా నిలుచుండునంట…

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా…

నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా…  నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా

నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా…

శరణు శరణు నీకు

శరణు శరణు నీకు

రాగం: అమృతవర్షిణి, తాళం: ఆది

స్వర రచన: శ్రీ బాలక్రిష్ణ ప్రసాద్ గారు

గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు

( అన్నమయ్య సంకీర్తన)

audio

పల్లవి:

శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ….

శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ

వరమునొసగవయ్య వాసుదేవ కృష్ణ

శరణూ…శరణు..2


చరణం:

మద్దులు విరిచినట్టి మాధవ కృష్ణ

సుద్దులు చెప్పవయ్య అచ్యుత కృష్ణ

మాధవ కృష్ణ…అచ్యత కృష్ణ

వొద్దురా గదవయ్య ఉపేంద్ర కృష్ణ

ముద్దులు గురియవయ్యా ముకుంద కృష్ణ

…శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ..

శరణూ…శరణు…2


గొల్లెతల మరగిన గోవింద కృష్ణ

చెల్లునయ్య నీ చేతలు శ్రీధర కృష్ణ

గోవింద కృష్ణ…శ్రీధర కృష్ణ

అల్లన దొంగాడవయ్య హరి శ్రీకృష్ణ

మల్లుల గెలిచినట్టి మధుసూదన కృష్ణ

….శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ

శరణూ…శరణు…2


గోవుల గాచినయట్టి గోపాల కృష్ణ

కైవశమై మమ్మేలు శ్రీకర కృష్ణ

గోపాల కృష్ణ..‌శ్రీకర కృష్ణ

నా విన్నపమాలించు నారాయణ కృష్ణ

సేవకుడ జుమ్మీ నీకు శ్రీవేంకట కృష్ణ 

….శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ

వరమునొసగవయ్య వాసుదేవ కృష్ణ

శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ

శరణూ....శరణు….3


16, అక్టోబర్ 2024, బుధవారం

జయ జయ దుర్గే

జయ జయ దుర్గే

రాగం:దుర్గ్, తాళం: ఆది

గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు

audio

పల్లవి:

జయజయ దుర్గే జితవైరీ వర్గే…2

వియత నీలాది విచిత్రా సర్గే

జయజయ దుర్గే జితవైరీ వర్గే

వియత నీలాది విచిత్రా సర్గే

జయజయ దుర్గే…..


చరణం:

సుందర తర చరణారవిందే…2

సుఖ పరిపాలిత లోక బృందే

సుందరతర చరణారవిందే

సుఖ పరిపాలిత లోక బృందే

నంద సునందాది యోగివంద్యే…2

నారాయణ సోదరి పరానందే

నంద సునందాది యోగివంద్యే

నారాయణ సోదరి పరానందే

నంద సునందాది యోగివందే

నారాయణ సోదరి పరానందే

…..జయజయ దుర్గే జితవైరీ వర్గే

వియత నీలాది విచిత్రా సర్గే

జయజయ దుర్గే…..


అనుదయలయ సచ్చిదానంద లతీకే…2

ఆలోల మణిమయ తాటంక ధనికే

అనుదయలయ సచ్చిదానంద లతీకే

ఆలోల మణిమయ తాటంక ధనికే

నానా రూపాది కార్య సాధనికే…2

నారాయణ తీర్థ భావిత ఫలకే

నానా రూపాదికార్య సాధనికే

నారాయణ తీర్థ భావిత ఫలకే

...జయజయ దుర్గే జితవైరి వర్గే

వియత నిలాది విచిత్ర సర్గే

జయ జయ దుర్గే…3

8, మే 2024, బుధవారం

వెంకటాచల నిలయం

వెంకటాచల నిలయం

సింధు భైరవి రాగం , ఆదితాళం

గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు

పురంధర దాసు కీర్తన

audio

పల్లవి :

వెంకటాచల నిలయం ….

వెంకటాచల నిలయం వైకుంఠ పురవాసం

పంకజ నేత్రం పరమ పవిత్రం

శంఖ చక్రధర చిన్మయ రూపం

...వెంకటాచల నిలయం వైకుంఠ పురవాసం…


చరణం :

అంబుజోద్భవ వినుతం ….

అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం

తుంబురు నారద గాన విలోలం

….వెంకటాచల నిలయం వైకుంఠ పురవాసం…



మకర కుండల ధరం ….

మకర కుండల ధరం మదన గోపాలం 

భక్త పోషక శ్రీ పురంధర విఠలం

….వెంకటాచల నిలయంవైకుంఠ పురవాసం

వైకుంఠ పురవాసం..2

3, మే 2024, శుక్రవారం

సింగార మూరితివి

సింగార మూరితివి 

Audio

ఖమాస్ రాగం ,తాళం: ఖండచాపు

గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు

అన్నమయ్య సంకీర్తన


పల్లవి :

సింగార మూరితివి…. 

సింగార మూరితివి చిత్తడ గురుడవు

సంగతి జూచేరు మిమ్ము సాసముఖ

….సింగార మూరితివి…..


చరణం :

పువ్వుల తెప్పల మీద పొలతులు నీవు నెక్కి

పువ్వులు ఆకాశము మోవ పూచి చల్లుచు

దేవ దుందుబులు మ్రోయ దేవతలు కొలువగా

సావధానమగు నీకు సాసముఖ

…..సింగార మూరితివి….‌


అంగరంగ వైభవాల అమర కామినులాడ

నింగి నుండి దేవతలు నిను చూడగ

సంగీత తాళవాద్య చతురతలు మెరయగ

సంగడి తేలేటి నీకు సాసముఖ

…..సింగార మూరితివి…..


పరగ కోనేటిలోన పసిడి మేడా నుండి

అరిది ఇందిరయు నీవు ఆరగించి

గరిమ శ్రీ వేంకటేశు కన్నుల పండువగాగ

సరవిలోలాడు నీకు సాసముఖ

…….సింగార మూరితివి చిత్తజ గురుడువు

సంగతి  జూచేరు మిమ్ము సాసముఖ

సింగార మూరితివి…...3

12, ఏప్రిల్ 2023, బుధవారం

కలశాపురము కాడ

 కలశాపురము కాడ

రాగం:వసంత, తాళం:ఆది

గానం:శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు


Audio

పల్లవి:

కలశాపురము కాడ కందువ సేసుకొని…..

కలశాపురము కాడ కందువ సేసుకొని

అలరుచున్నవాడు హనుమంతరాయడు


చరణం:

సహజాన నొకజంగ జాచి….

సహజాన నొకజంగ జాచి సముద్రము దాటి

మహిమ మీరగ హనుమంతరాయడు

ఇహమున రామ బంటై యిప్పుడు నున్నవాడు

అహరహమును దొడ్డ హనుమంతరాయడు

….కలశాపురము కాడ…..


నిండు నిధానపు లంక నిమిషాన నీరుసేసె

మండిత మూరితి హనుమంతరాయడు

దండితో మగిడి వచ్చి తగ సీత శిరోమణి

అండ రఘుపతి కిచ్చే హనుమంతరాయడు

….కలశాపురము కాడ…..


వదలని ప్రతాపాన వాయుదేవు సుతుడై

మదియించినాడు హనుమంతరాయడు

చెదరక యేప్రొద్దు శ్రీవేంకటేశు వాకిట

అదివో కాచుకున్నాడు హనుమంతరాయడు

…..కలశాపురము కాడ కందువ సేసుకొని

అలరుచున్నవాడు హనుమంతరాయడు… 2


4, ఏప్రిల్ 2023, మంగళవారం

పతికి మంగళ హారతీరే

 పతికి మంగళ హారతీరే

Audio


రాగం:  ఆరభి, తాళం: ఆది

త్యాగరాజస్వామివారి కృతి

గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు

 

పల్లవి:

పతికి మంగళ హారతీరే

భామలార నేడు సాకేత

పతికి మంగళ హా…ర…తీ…రే భామలారా నేడు

సాకేత పతికి మంగళ హారతీరే ……


అనుపల్లవి:

మతికి సొంపుగలుగ జేయు

సద్గుణవతికి మానవతికి సీతా

పతికి మంగళ హారతీరే …..


చరణం:

కామదిరిపు విదారికి హరికి

సామాది నిగమచారికి 

కామదిరిపు విదారికి హరికి

సామాది నిగమచారికి సూర్యా

సోమాక్షునికి త్యాగరాజ 

ప్రేమవతారునికి కోసల

పతికి మంగళ హారతీరే భామలారా నేడు

సాకేత పతికి మంగళ హారతీరే …..