11, జనవరి 2020, శనివారం

Vadivo kantiratare వాడివో కంటిరటరే

వాడివో కంటిరటరే
రాగం : హిందోళం , తాళం : ఆది(తిశ్రగతి)
స్వర రచన : శ్రీ వేదవ్యాస ఆనంద భట్టార్ గారు
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
( అన్నమయ్య సంకీర్తనలు )
Audio
పల్లవి :
వాడివో కంటిరటరే వన్నెలవాడు
పైడి మోలము కటారు పరుజులవాడు
వాడివో...వాడివో….
వాడివో కంటిరటరే వన్నెలవాడు

చరణం :
పెద్దకిరీటమువాడు పీతాంబరమువాడు
వొద్దిక కౌస్తుభమణి ఉరమువాడు
ముద్దుల మొగమువాడు ముత్తేల నామమువాడు
అద్దిగో శంఖచక్రాల హస్తాలవాడు
…..వాడివో…వాడివో…వాడివో కంటిరటరే వన్నెలవాడు….

అందిన కటిహస్తము అభయ హస్తమువాడు
అందెల గజ్జెల పాదాలమరువాడు
కుందణంపు యీ మకర కుండలంబులవాడు
కందువ బాహుపురుల కడియాలవాడు
…...వాడివో….వాడివో…వాడివో కంటిరటరే వన్నెలవాడు…..


నగవు చూపులవాడు నాభికమలమువాడు
మొగపుల మొలనూళ్ళ మొలవాడు
చిగురు మోవివాడు శ్రీవేంకటేశుడు
తగు నలమేల్మంగ తాళి మెడవాడు
,.,.వాడివో…..వాడివో.…..వాడివో కంటిరటరే వన్నెలవాడు
పైడి మోలము కటారు పరుజులవాడు
వాడివో...వాడివో….

Okapari okapari vayyaramai ఒకపరి కొకపరి వయ్యారమై

ఒకపరి కొకపరి వయ్యారమై
రచన : పెద్ద తిరుమలాచార్యులు
స్వర రచన : నేదునూరి క్రిష్ణమూర్తిగారు
కళ్యాణ సంకీర్తన
రాగం : ఖర హర ప్రియ రాగం 
తాళం : ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
( అన్నమయ్య సంకీర్తనలు )
Audio
పల్లవి :
ఒకపరి కొకపరి వయ్యారమై…..
ఒకపరి కొకపరి వయ్యారమై
ముఖమున కళలెల్ల మొలచినట్లుండె
….ఒకపరి కొకపరి వయ్యారమై

చరణం :
జగదేక పతి మేన చల్లిన కర్పూర ధూళి
జిగికొని నలువంక చిందగాను
మొగి చంద్రముఖి ఉరమున నిలిపెగాన
పొగరు వెన్నెల దిగబోసినట్లుండె
…..ఒకపరి కొకపరి వయ్యారమై….

పొరి మెరుగు చేక్కుల పూసిన తట్టూ పునుగు
కరిగి ఇరుదెసల కారగాను……
కరిగమన విభుడు గనుక మోహ మదము
తొరిగి సామజ సిరి తొలికీనట్లుండె
….ఒకపరి కొకపరి వయ్యారమై….

మెరయా శ్రీ వేంకటేశు….
మెరయా శ్రీ వేంకటేశు మేన సింగారముగాను
తరచైన సొమ్ములు ధరియించగా 
మెరుగు బోడి అలిమేలు మంగయు తాను
మెరుపు మేఘము గూడి మెరసినట్టుండె
….ఒకపరి కొకపరి వయ్యారమై
ముఖమున కళలెల్ల మొలచినట్లుండె
ఒకపరి కొకపరి వయ్యారమై….






Gobhiyallo gobhiyallo kondalaiahku gobbilloగొబ్బియళ్ళో గొబ్బియళ్ళో కొండలయ్యకు గొబ్బిళ్ళు

గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో కొండలయ్యకు గొబ్బిళ్ళు
Audio
పల్లవి :
గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో కొండాలయ్యకు గొబ్బిళ్ళు
ఆదిలక్ష్మీ అలమేలమ్మకు అందామైన గొబ్బిళ్ళు

చరణం :
కన్నెపిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు
ఆ వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు
ముద్దులగుమ్మ  బంగరుబొమ్మ రక్మీణమ్మకు గొబ్బిళ్ళు
ఆ రుక్మీణమ్మకు గొబ్బిళ్ళు
...గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో…

చల్లగ ప్రజలను ఏలిన రేడు రామయ్య తండ్రికి గొబ్బిళ్ళు
ఆ రామయ్య తండ్రికి గొబ్బిళ్ళు
కన్నాతల్లి కల్పావల్లి సీతమ్మ తల్లికి గొబ్బిళ్ళు
ఆ సీతమ్మ తల్లికి గొబ్బిళ్ళు
...గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో…

పాడీ పంటల తులతూగే మా భారతమాతకు గొబ్బిళ్ళు
మా భారత్మమాతకు గొబ్బిళ్ళు
శాంతి సౌఖ్యం ధర్మం నిలిపే స్వతంత్రలక్ష్మీకి గొబ్బిళ్ళు
మా స్వతంత్రలక్ష్మికి గోబ్బిళ్ళు
….గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో కొండాలయ్యకు గొబ్బిళ్ళు
ఆదిలక్ష్మీ అలమేలమ్మకు అందామైన గొబ్బిళ్ళు…..