15, సెప్టెంబర్ 2021, బుధవారం

పూజ చేతునే pooja chetune

 పూజ చేతునే 

రాగం : యమన్ కళ్యాణి ,తాళం: ఆది

గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు

Audio
పల్లవి:

పూజ చేతునే గౌరి నీకు పూల పందిరిలోన….


చరణం:

పసుపును కుంకుమ పడతిరో నీకు

పరమేశ్వరినీ పాదములకు నే

….పూజ చేతునే గౌరి నీకు పూల పందిరిలోన…


అత్తరు పన్నీరు పునుగు జవ్వాది

సర్వేశ్వరి ఇదే సరగున బ్రోవవే

….పూజ చేతునే గౌరి నీకు పూల పందిరిలోన….


గంధ పుష్పాదులు గైకొను తల్లి

గౌరి దేవి మా కోర్కెలు దీర్చవే

....పూజ చేతునే గౌరి నీకు పూల పందిరిలోన….


ఘృత క్షీరాన్నము కదళీఫలము

నారికేళము నైవేద్యమిదే

….పూజ చేతునే గౌరి నీకు పూల పందిరిలోన….


శంకరీ నీకు వందనమిదిగో

దక్షుని తనయవో దయగని బ్రోవవే

….పూజ చేతునే గౌరి నీకు పూల పందిరిలోన…..

నీకు పూల పందిరిలోన…..2