31, అక్టోబర్ 2022, సోమవారం

అరుణాద్రివాసా శ్రీరమణ

Audio 

అరుణాద్రివాసా శ్రీరమణ

రచన: సూరి నాగమ్మగారు

రాగం: ఆనందభైరవి, తాళం: ఆది

గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు


పల్లవి:

అరుణాద్రివాసా శ్రీరమణ

నన్నరసి రక్షింపవే ఆనందరమణ

అరుణాద్రివాసా….


చరణం:

తనువే నను భ్రాంతి విడక

వెర్రీ తలపోతల చిక్కి తల్లడిల్లెదను

కరుణింపుమని అందుమన్నా

నీ / ఆ కరుణే నీరూపముగా కనవచ్చునన్నా

…..అరుణాద్రివాసా …..


కన్నారా మది నిన్ను కనకా

నాకన్నా నే వెలిగాంచి కలతనొందెదను

డెంద మందలి పుండు బాపి

శాంతీ నంద చేసెదవనుచు ఆశ చెందితిని

….అరుణాద్రివాసా….


ఐంద్రజాలిక జగము గాంచి

భ్రమల నందినే పరమాత్మ పొందలేనైతి

తొలికర్మ ఫలమేమొగాని నీ

బలిమి కలిగియు శాంతి బడయెనేగాక

..‌‌అరుణాద్రివాసా….


శరదిందు సుందరవదనా

నీ చరణమంబులే నాకు శరణంటినయ్యా

ఆవర్తపురి జన్మసదనా

నాగాంబ మానస సరసి హంస శ్రీరమణా

….అరుణాద్రివాసా శ్రీరమణ

నన్నరసి రక్షింపవే ఆనందరమణ…3