28, అక్టోబర్ 2017, శనివారం

O mantralaya ఓ మంత్రాలయ

ఓ మంత్రాలయ
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రీగారు
గానం : శ్రీమతి మోక్కరాల కామేశ్వరీగారు
ఆది/ఏకతాళం
Audio
పల్లవి :
ఓ మంత్రాలయ ఓ మహదేవయ
ఓ మొరవినవయ ఓ మూర్తీత్రయ
ఒరవడినీయ ఒజ్జగ రావయ
*ఓం*కార రూపాయ నమఃశివాయ
ఓయనవయ్యా ఓయీ శివయ్య

చరణం :
నాగుల నగలే నిగ నిగ మెరయ
నగజ నగవులే నాదము నీయ
నిగమ నీమముల నర్తన సాయ
*న*కార రూపాయ నమః శివాయ
ఓయనవయ్యా ఓయీ శివయ్య

మానిని హిమజకు మనసిజుడవయ
మరుని చరితకు మహితార్ధమీయ
ముక్తి మందిరకు మొఘసాలమీయ
*మ*కార రూపాయ నమఃశివాయ
ఓయనవయ్యా ఓయీ శివయ్య

శీతల శితశిల శ్రీపీఠమీయ
శిరమున సురఝరి శిఖిసతి జతులీయ
శృతి తతి స్థితి గల స్థితమై మ్రోయా
*శి*కార రూపాయ నమఃశివాయ
ఓయనవయ్యా ఓయీ శివయ్య

వాగాతీతము వర్ణన సేయ
వేదాతీతము విదితము సేయ
విశ్వాతీతము వీక్షణ సేయ
*వ*కార రూపాయ నమఃశివాయ
ఓయనవయ్యా ఓయీ శివయ్య

యాతన నణచే యతనము సేయ
యమ నియమముల యజనము సేయ
యోగ యాచనకు యోగ్యతనీయ
*య*కార రూపాయ నమఃశివాయ

ఓయనవయ్యా ఓయీ శివయ్య…..3
ఓయీ శివయ్య ….ఓయీ శివయ్య

21, అక్టోబర్ 2017, శనివారం

Subramanyam neekide సుబ్రమణ్యం నీకిదే

సుబ్రమణ్యం నీకిదే
ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీ గారు
Audio
పల్లవి :
సుబ్రమణ్యం నీకిదే కర్పూర హారతి
భవ్య చరిత నీకిదే ఈ దివ్య హారతి
దేవసేనా సమేత వల్లి మోహన
మోపిదేవి నిలయ కరుణాలయా
….సుబ్రమణ్యం నీకిదే కర్పూర హారతి….

చరణం :
ఆదిశేషుడవై నీవు హరికి పానుపైనావు
ఫణిరాజువై నీవు హర భూషణమైనావు
బుజ్జి గణపతికి నీవు యజ్ఞోపవీతమే
మాపాలి దేవుడవై అండగా నిలువుమయా
…...సుబ్రమణ్యం నీకిదే కర్పూర హారతి….

నీపుట్ట దరికి మాపాపలొస్తేను
బుసకొట్టబోకయ్య కాటేయబోకు
పుట్టింటివారిని మెట్టినింటివారిని
కనుపాపగా నువ్వు కాపాడవయ్యా

సుబ్రమణ్యం నీకిదే కర్పూర హారతి
భవ్య చరిత నీకిదే ఈ దివ్య హారతి
దేవసేనా సమేత వల్లీ మోహన
మోపిదేవి నిలయ కరుణాలయా
సుబ్రమణ్యం నీకిదే కర్పూర హారతి
కర్పూర హారతి కర్పూర హారతి…..

12, అక్టోబర్ 2017, గురువారం

Siva Siva mahadeva శివ శివ మహాదేవ

శివ శివ మహాదేవ
శివపధం
రచన : సామవేద షణ్ముక శర్మగారు
సరస్వతిరాగం , ఖండగతి తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠా నీకు నీరాజనం నీరాజనం  
శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠా నీకు నీరాజనం నీరాజనం

చరణం :
సామి సామేనీ సొగసైన గౌరమ్మ
నిఖిల జనని నీకు నీరాజనం నీరాజనం
అంతరాయమ్ములను అంతమొందించేటి గణనాయక నీకు నీరాజనం
శక్త్యాయుధమ్ముతో సకలమును పాలించు
దేవ షణ్ముక విభో నీరాజనం
దేవ షణ్ముక విభో నీరాజనం

….‌‌‌.శివ శివ మహాదేవ శంభో మహాదేవ  నీలకంఠా నీకు నీరాజనం నీరాజనం…..

దక్ష మధ విధ్వంస భద్ర పదదాయక
వీరభద్రా నీకు నీరాజనం నీరాజనం
శంభు వాహన మశిత శైలాభ దేహ
వీర నందీశ్వర నీరాజనం
ప్రభు సేవలో మురియు ప్రమధ వరులార నిత్య శివ మయులారా నీరాజనం
నిత్య శివ మయులారా నీరాజనం

….‌.. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠా నీకు నీరాజనం నీరాజనం
నీరాజనం నీరాజనం నీరాజనం…...

9, అక్టోబర్ 2017, సోమవారం

ఓంసాయి శ్రీసాయి omsai srisai

ఓం సాయి శ్రీసాయి
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి
ఓంకార శ్రీకార వందితాకారా

చరణం :
ఓం సత్య ఓం సాయి ఓ ప్రేమసాయి
ఆశ్రిత జనపాల ఆదుకోవయ్య
నీ సన్నిధి కరుణా మా పెన్నిధి సాయి
మమ్మేలుకోవయ్య మహరాజసాయి

ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి
ఓంకార శ్రీకార వందితాకారా

అభయహస్తము చూపి అంతటా నిలిచి
సంకటములను బాపు శాంతగుణ రూప
నీసేవ నీపూజ నీస్మరణ చేయగా
నీచూపు నీప్రేమ మము రక్షింప

ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి
ఓంకార శ్రీకార వందితాకారా

ద్వారకామాయి షిరిడి నివాసా
జ్ఞాన స్వరూపా దీన దయాసాంద్రా
శ్రీసాయినాధా జయ సాయినాధా
హే సాయినాధా జయ జయ సాయి

ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి
ఓంకార శ్రీకార వందితాకారా
వందితాకారా వందితాకారా వందితాకారా

6, అక్టోబర్ 2017, శుక్రవారం

Sambho Sankara శంభో శంకర

శంభో శంకర
పంతు వరాళి రాగం, ఆదితాళం
రచన : విశ్వనాధ కామేశ్వరరావు
స్వర రచన : సత్తిరాజు వేణు మాధవ్ గారు
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
..శంభో శంకర సాంబ సదాశివ
శంభో శంకర సాంబశివ..3

పల్లవి :
శంభో శంకర సాంబశివా శివ
శంభో శంకర సదాశివ

చరణం :
ఆది అంతములు లేని వాడవై అనంత విశ్వము నీవే నిండి...2
ఆదిశక్తికి  అర్ధాంగ మిచ్చిన ఆనందమయ నాట్య స్వరూప.‌…
ఆదిశక్తికి అర్ధాంగమిచ్చిన ఆనందమయ నాట్య స్వరూప

పంచ భూతముల నిర్మితమైన
మానవులను ఇల ఉద్దరించుటకు
కాంచీపురమున బలిమి లింగమై
జంబుకేశ్వరమున జల లింగమై
…….శంభో శంకర సాంబశివా శివ
శంభో శంకర సదాశివ…….

విభూదిని చూప విభూది ధరించి విరాగిగా మరుభూములు తిరిగి..2
జనన మరణములు మాయా మయమని సదాశివమే సత్యమని తెలిపి….
జనన మరణములు మాయా మయమని సదాశివమే సత్యమని తెలిపి

అరుణాచలమున అగ్నిలింగమై
కాళహస్తిన వాయులింగమై
చిదంబరమున ఆకాశ లింగమై
వెల్లి విసిరిన మహిమల నొప్పిన
……...శంభో శంకర సాంబశివా శివ
శంభో శంకర సదాశివ…...

శంభో శంకర సాంబ సదాశివ
శంభో శంకర సాంబశివ...5

Ammamma emmamma అమ్మమ్మ ఏమమ్మా

అమ్మమ్మ ఏమమ్మా
భైరవిరాగం, ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
అమ్మమ్మా ఏమమ్మా అలమేల్మంగ నాంచారమ్మా
తమ్మి ఇంట నలరు కొమ్మా ఓయమ్మా
…...అమ్మమ్మా ఏమమ్మా అలమేల్మంగ నాంచారమ్మా
తమ్మి ఇంట నలరు కొమ్మా  తమ్మియింట నలరు కొమ్మా .ఆ.ఆ..ఆ.ఆ..…...

చరణం :
నీరిలోన తల్లడించి నీకే తలవంచీ
నీరికింద పులకించి నీరమణుండు
గోరికొన చెమరించి కోపమే పచరించీ
సారెకు నీ యలుక ఇట్టే చాలించవమ్మా
…..అమ్మమ్మా ఏమమ్మా అలమేల్మంగ నాంచారమ్మా
తమ్మి ఇంట నలరు కొమ్మా తమ్మియింట నలరు కొమ్మా .ఆ.ఆ..ఆ.ఆ..…...

నీకుగానే చేయిచాచి నిండా కోపము రేచీ
మేకొని నీ విరహానా మేను వెంచీని
ఈకడాకడి సతుల హృదయమే పెరరేచీ
ఆకు మడచీయనైన ఆనతీయవమ్మా
…...అమ్మమ్మా ఏమమ్మా అలమేల్మంగ నాంచారమ్మా
తమ్మి ఇంట నలరు కొమ్మా  తమ్మియింట నలరు కొమ్మా .ఆ.ఆ..ఆ.ఆ..…...

చక్కదనములే పెంచీ సకలము గాల దంచి
నిక్కపు వెంకటేశుడు నీకే పొంచీని
మక్కువతో అలమేలు మంగా నాంచారమ్మా
అక్కున నాతని నిట్టే అలరించవమ్మా
…...అమ్మమ్మా ఏమమ్మా అలమేల్మంగ నాంచారమ్మా
తమ్మి ఇంట నలరు కొమ్మా  తమ్మియింట నలరు కొమ్మా .ఆ.ఆ..ఆ.ఆ..…...