ఓ మంత్రాలయ
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రీగారు
గానం : శ్రీమతి మోక్కరాల కామేశ్వరీగారు
ఆది/ఏకతాళం
Audio
పల్లవి :
ఓ మంత్రాలయ ఓ మహదేవయ
ఓ మొరవినవయ ఓ మూర్తీత్రయ
ఒరవడినీయ ఒజ్జగ రావయ
*ఓం*కార రూపాయ నమఃశివాయ
ఓయనవయ్యా ఓయీ శివయ్య
చరణం :
నాగుల నగలే నిగ నిగ మెరయ
నగజ నగవులే నాదము నీయ
నిగమ నీమముల నర్తన సాయ
*న*కార రూపాయ నమః శివాయ
ఓయనవయ్యా ఓయీ శివయ్య
మానిని హిమజకు మనసిజుడవయ
మరుని చరితకు మహితార్ధమీయ
ముక్తి మందిరకు మొఘసాలమీయ
*మ*కార రూపాయ నమఃశివాయ
ఓయనవయ్యా ఓయీ శివయ్య
శీతల శితశిల శ్రీపీఠమీయ
శిరమున సురఝరి శిఖిసతి జతులీయ
శృతి తతి స్థితి గల స్థితమై మ్రోయా
*శి*కార రూపాయ నమఃశివాయ
ఓయనవయ్యా ఓయీ శివయ్య
వాగాతీతము వర్ణన సేయ
వేదాతీతము విదితము సేయ
విశ్వాతీతము వీక్షణ సేయ
*వ*కార రూపాయ నమఃశివాయ
ఓయనవయ్యా ఓయీ శివయ్య
యాతన నణచే యతనము సేయ
యమ నియమముల యజనము సేయ
యోగ యాచనకు యోగ్యతనీయ
*య*కార రూపాయ నమఃశివాయ
ఓయనవయ్యా ఓయీ శివయ్య…..3
ఓయీ శివయ్య ….ఓయీ శివయ్య
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి