శ్రీరామ గాన సుధ
1.మహాగణపతిం
దీక్షితార్ కీర్తన...నాటరాగం...ఏకతాళం
పల్లవి :
మహాగణపతిం
మహాగణపతిం మనసా స్మరామి
వశిష్ట వామ దేవాది వందిత
…..మహాగణపతిం…..
చరణం :
మహాదేవసుతం
గురుగుహనుతం
మారకోటి ప్రకాశం శాంతం
మహాకావ్య నాటకాధి ప్రియం
మూషిక వాహన మోదక ప్రియం
…..మహాగణపతిం…….
2.రాముడుద్భవించినాడు
గురిమెళ్ళంక రంగదాసు కీర్తన
ఝుంఝూటి రాగం
చాపుతాళం, మధ్యమావతి
పల్లవి :
రాముడుద్భవించినాడు రఘుకులంబున/శ్రీ
అనుపల్లవి :
సోమకులను దునిమి దిజ స్తోమంబున
క్షేమముకై కోమలి కౌసల్యకు
….శ్రీ రాముడుద్భవించినాడు రఘుకులంబున….
చరణం :
ధరను చైత్ర శుద్ధ నవమి పునర్వసందున సరస కర్కాటక లగ్న మీరయగ సురవరు లెలమని కురియింపగ విరుల వాన
...శ్రీరాముడుద్భవించినాడు…
దశరధుండు భూసురులకు ధనమొసంగగా
విసెరెమలయా మారుతములు దిశెలెల్లను విశదములై వసుమతి దుర్భరము బాప
….శ్రీరాముడుద్భవించినాడు రఘుకులంబున….
కలువలను మించు కనుల కాంతి వెల్లగ
పలువరుస ఆణిముత్య
కళలీయని కళలొలుగ కిల కిలమని నవ్వుచు
….శ్రీరాముడుద్భవించినాడు….
3.రాముడు రాఘవుడు
అన్నమయ్య సంకీర్తన...కానడరాగం...ఆదితాళం
పల్లవి :
రాముడు రాఘవుడు రవికులుడితడు
భుమిజకు పతియైన పురుషనిధానము
రాముడు రాఘవుడు రవికులుడితడు…...ఉ..ఉ..ఉ..ఉ..
చరణం :
అరయ పుత్ర కామేష్టి యందు పరమాన్నమున
పరగ జనించిన పరబ్రహ్మము
సురల రక్షింపగ అసురుల శిక్షింపగ
తిరమై ఉదయించిన దివ్య తేజము
రాముడు రాఘవుడు రవికులుడితడు…...ఉ..ఉ..ఉ..ఉ..
చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో
సంతతము నిలిచిన సాకారము
వింతలుగా మునులెల్ల వెదకిన యట్టి
కాంతుల చెన్నుమీరిన కైవల్య పదము
రాముడు రాఘవుడు రవికులుడితడు…...ఉ..ఉ..ఉ..ఉ..
వేదవేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు
పాదుకొన పలికేటి పరమార్ధము
పోదితో శ్రీ వేంకటాద్రి పొంచి విజయ నగరాన
ఆదికి అనాది అయిన అర్చావతారము
రాముడు రాఘవుడు రవికులుడితడు
భుమిజకు పతియైన పురుష నిధానము
రాముడు రాఘవుడు రవికులుడితడు…...ఉ..ఉ..ఉ..ఉ..
4.మేలుకో దయానిధి
త్యాగరాజ కీర్తన...సౌరాష్ట్ర గానం ...రూపకతాళం
పల్లవి :
మేలుకో దయానిధి మేలుకో ధాశరధి
మేలుకో దయానిధి మిత్రోదయమౌ వేళ
మేలుకో దయానిధి…….
చరణం :
వెన్న పాలు బంగారు గిన్నెలోనే ఉంచినాము
తిన్నగారగించి తేట కన్నులతో
నన్ను బ్రోవ
మేలుకో దయానిధి……..
నారదాది మునులు సురలు వారిజభవుడిందు కళాధారులు
నీ సన్నిధిలో కోరి కొలువ గాచినారు
మేలుకో దయానిధి…
రాజ రాజాది దిగ్రజులెల్ల వచ్చినారు
రాజనీతి తెలియ త్యాగరాజ వినుత నన్ను బ్రోవ
మేలుకో దయానిధి….పల్లవి పూర్తిగా.మేలుకో దయానిధి,
మేలుకో దయానిధి,
దయానిధి, దయానిధి…...
5.రామభద్రరారా
రామదాసు కీర్తన….శంకరాభరణరాగం….ఖండచాపు తాళం
పల్లవి :
రామభద్ర రారా శ్రీరామచంద్రా రారా
తామరాసలోచనా సీతా సమేత రారా
ముద్దు ముద్దుగారగ నవ మోహనాంగ రారా
అద్దంబు చెక్కిళ్ళవాడ నీరజాక్ష రారా
.....రామభద్ర రారా…..
చరణం :
చెంచు రవి రేఖతో నీ సొంపు చూపురారా
పంచదార చిలుకలతో పలుకుదువు రారా
పట్టరాని ప్రేమతో నా పట్టుకొమ్మ రారా
గట్టిగా కౌసల్య ముద్దు పట్టి వేగరారా
…..రామభద్ర రారా….
నిన్నేమనులేనురా నీలవర్ణరారా
కన్నుల పండుగా నన్ను కన్న తండ్రి రారా
అందెల మువ్వల చేత సందడిస్త రారా
కుందనపు బొమ్మ ఎంతో అందగాడా రారా
…...రామభద్ర రారా….
ముజ్జగములకు ఆదిమూల బ్రహ్మ రారా
గజ్జల చప్పుళ్ళు ఘల్లు ఘల్లు మనరారా
సామగాన లోల నా చక్కనయ్యరారా
రామదాసు నేలిన భద్రాద్రి వాస రారా
….రామభద్ర రారా…..
6.ఉయ్యాలలూగుమయ్యా
త్యాగరాజకృతి….నీలాంబరి రాగం….
ఝుంపెతాళం
పల్లవి:
ఉయ్యాలలూగవయ్యా
ఉయ్యాలలూగుమయ్యా శ్రీరామ
సయ్యాట పాటలను సత్సార్వభౌమా
...ఉయ్యాలలూగవయ్యా….
చరణం:
కమల జాద్యఖిల సురులు నిను గొల్వ
విమలులైన మునీంద్రులు ధ్యానింప కమనీయ భాగవతులు గుణకీర్తనములు ఆలాపనంబులు సేయగా
….ఉయ్యాలలూగవయ్యా శ్రీరామ
సయ్యాట ఆటలను
సత్సార్వభౌమా……..ఉయ్యాలలూగవయ్యా….2
7.శ్రీచక్ర రాజ సింహాసనేశ్వరి
రాగమాలిక.. ఆదితాళం
శ్రీచక్ర రాజ సింహాసనేశ్వరీ శ్రీ లలితాంబికయే
భువనేశ్వరి
ఆగమ వేదకళా మయరూపిణి
అఖిల చరాచరా జననీ నారయణీ
నాదా కంకణ నటరాజ మనోహరీ
ఙ్ఞాన విజ్ఞేశ్వరి రాజరాజేశ్వరి.
…...శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి…
చరణం
కదంబవనమున వెలసిన దేవి
కారుణ్యమూర్తి కమలేక్షణి..
కామేశ్వరుని రాణి కంజదళాయ దాక్షి
కామిత ఫలదాయినీ కామాక్షి...
.శ్రీచక్ర రాజ సింహాసనేశ్వరి….
నిరుపమ ఆనంద సుఖదాయినీ
నిఖిల లోక జననీ అంబా..
నీరజనేత్రి నిత్య కళ్యాణి..
నీచరణములే నమ్మితినమ్మా...
…..శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి….
పరమపావని పశుపతి రాణీ
పరమేశ్వరీ నీ పదములే నమ్మితి..
పరమ పవిత్రి పావన గాత్రి…..
పాలింపుమూ అమ్మ
జననీ పార్వతి
....శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి….
8.సీతాలాలి లోకమాతాలాలి
రచన : శ్రీమతి వేమూరి సరోజనీ శాస్త్రీగారు, ఆనందభైరవిరాగం, ఆదితాళం
పల్లవి :
సీతా లాలి లోకమాతా లాలి
దివి నుండి భువికి దిగి వచ్చిన దయామయి లాలి
చరణం :
నాగేటి చాలు లో దొరికిన లక్ష్మీ లాలి భాగ్యలక్ష్మీ లాలి
జనకుని తపము పండగ వచ్చిన జానకి లాలి
…..సీతాలాలి….
మల్లెల మొల్లల జాజుల పానుపు పరచితినోయమ్మా
అల్లరి సేయక ఉల్లమలరగా నిదురించవే అమ్మా
….సీతాలాలి…
లాలి లాలనుచు పాడే భాగ్యము మాకిచ్చిన తల్లి
పదసరోజముల శరణ మిచ్చి మము కాపాడవే తల్లి
……...సీతా లాలి……
9.శ్రీరామ జయరామ
యదుకుల కాంభోజి రాగం
ఖండచాపు తాళం
త్యాగరాజ స్వామి వారి దివ్యనామ సంకీర్తన
పల్లవి :
శ్రీరామ జయరామ శృంగార రామ యని
శ్రీరామ జయరామ శృంగార రామ యని చింతింపరాదే ఓ మనసా
చరణం :
తళుకు చెక్కుల ముద్దుబెట్ట కౌసల్యమును తపమేమి చేసెనో
కౌసల్య తపమేమి చేసెనో తెలియా...ఆ..ఆ….ఆ..ఆ……
ధశరథుడు శ్రీరామ రారా యని పిలువమును తపమేమి చేసెనో ధశరథుడు తపమేమి చేసెనో తెలియా...ఆ..ఆ…...ఆ..ఆ……
తనివార పరిచర్య చేయ సౌమిత్రిమును తపమేమి చేసెనో సౌమిత్రి తపమేమి చేసెనో తెలియా...ఆ..ఆ...ఆ...ఆ….
తన వెంట చన జూచి ఉప్పొంగ కౌశికుడు తపమేమి చేసెనో కౌశికుడు తపమేమి చేసెనో తెలియా...ఆ..ఆ..ఆ..ఆ….
తాపంబణగి రూపవతియౌట కహల్య తపమేమి చేసెనో అహల్య తపమేమి చేసెనో తెలియా...ఆ..ఆ...ఆ..ఆ…..
ధర్మాత్మ చరణంబు సోక శివచాపంబు తపమేమి చేసెనో చాపంబు
తపమేమి చేసెనో తెలియా..ఆ..ఆ..ఆ...ఆ…..
తన తనయ నొసగి కనులార గన జనకుండు
తపమేమి జేసెనో జనకుండు తపమేమి జేసెనో తెలియా...ఆ...ఆ...ఆ...ఆ….
దహరంబు కరగా కరము బట్ట జానకి తపమేమి చేసెనో జానకి తపమేమి చేసెనో తెలియా..ఆ..ఆ..ఆ...ఆ…..
త్యాగరాజాప్తాయని పొగడ నారదమౌని తపమేమి చేసెనో ఆ మౌని తపమేమి చేసెనో తెలియా..ఆ...ఆ...ఆ...ఆ…...
శ్రీరామ జయరామ శృంగార రామయని చింతింపరాదే ఓ మనసా
10.నగుమోము గనలేని
అభేరిరాగం, ఆదితాళం
త్యాగరాజకృతి
పల్లవి:
నగుమోము గనలేని నాజాలి తెలిసి
నన్ను బ్రోవ రాదా శ్రీ రఘువర నీ ( నగు )
అనుపల్లవి :
నగరాజ ధర నీదు పరివారు లెల్ల
ఒగి భోధన జేసే వారలు కారేయ్ ఆటులుండుదరే నీ (నగు)
చరణం :
ఖగరాజు నీ యానతి విని వేగ చన లేడో
గగనానికిలకు బహుదూరం బనినాడో
జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడదు
వగచూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజనుత నీ (నగు)
11.కౌసల్యా సుప్రజా రామా
కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్ధూలా కర్తవ్యం దైవ మాహ్నికం
12.బ్రోచేవారెవరురా
బ్రోచేవారెవరురా నిను వినా రఘువరా
నీ చరణాంబుజములనే విడజాల కరుణాల వాల
ఓచతురాననాది వందిత నీకు పరాకేలనయ్యా
నీ చరితము పొగడలేని నా చింతదీర్చి వరములిచ్చి వేగమే
…..బ్రోచేవారెవరురా….
సానిదపదని సనిదదప మపాద మగామ పదని
సనీదపమ నిదపమ గమప దమగరి సమాగమ సద
మాపదని ససరినీ నినిసదా దదనిపాద మపదనిప నిదప
మగమనిదని సదమా పదని
సమాగరి సరిసా నిదస సనీదపమ గమ పదని
….బ్రోచేవారెవరురా…..
సీతాపతే నాపై నీకభిమానము లేదా
వాతాత్మ జార్చిత పాద నామొరలను వినరాదా
భాసురముగ కరిరాజుని బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా
సానిదపదని సనిదదప మపాద మగామ పదని
సనీదపమ నిదపమ గమప దమగరి సమాగమ సద
మాపదని ససరినీ నినిసదా దదనిపాద మపదనిప నిదప
మగమనిదని సదమా పదని
సమాగరి సరిసా నిదస సనీదపమ గమ పదని
….బ్రోచేవారెవరురా…..
13.సార-సార ఒయ్యారపు
మాయ మాళవగౌళ రాగం ,త్యాగరాజకృతి
పల్లవి :
మేరు సమాన ధీర వరద
రఘువీర జూతాము రారా
మేరు సమాన ధీర
అనుపల్లవి :
సార-సార ఒయ్యారపు నడలనయ
నీరస కాంతిని ఠీవీని మహా
…..మేరు…
చరణం :
అలకల ముద్దును తిలకపు తీరును
తళుకు చెక్కులచే తనరు నెమ్మోమును
గళమున శోభిల్లు కనక భూషణములను
దళిత దుర్- మానవ త్యాగరాజార్చిత
మేరు సమాన ధీర వరద
రఘువీర జూతాము రారా
మేరు సమాన ధీర
14. ఒకపరి ఒకపరి ఒయ్యారమై
పెద తిరుమలాచార్య రచన , ఆదితాళం
పల్లవి :
ఒకపరి ఒకపరి ఒయ్యారమై
మొఖమున కళలెల్ల మొలచి నట్లుండే
...ఒకపరి ఒకపరి…….
చరణం :
జగదేకపతిమేన చల్లిన కర్పూర ధూళి
జిగికొని నెలవంక చిందగాను
మొగి చంద్రముఖి ఉరమున నిలిపెగాన
పొగరు వెన్నెల దిగవొసి నట్లుందె
….ఒకపరి ఒకపరి….
పొరి మెరుగు చెక్కుల పూసిన తట్టు పునుగు
కరగి ఇరుదెసల కారగాను
కరి గమన విభుడు గనుక మోహ మదము
తొరిగి సామజ సిరి లొలికి నట్టుండె
..ఒకపరి ఒకపరి……
మెరయు శ్రీవేంకటేశు మేన సింగారముగారు
తరచైన సొమ్ములు ధరియించగా
కరగమన విభుడు అలమేలు మంగయు తాను
మెరుపు మేఘము గూడి మెరసి నట్లుండె
…...ఒకపరి ఒకపరి…...
15.ఏమి సొగసు ఈ సీతది
రచన: శ్రీమతి సరోజనీ శాస్త్రీగారు
ఆదితాళం
పల్లవి :
ఏమి సొగసు ఈ సీతది ఎంతటి సౌకుమార్యమీ సుదతిది
చరణం:
కలువరేకుల వంటి కన్నులతో
సంపెంగ సుమము బోలు నాసికతో
నింబఫలము వంటి అధరంబుతో తళ తళ మను దంత కాంతులతో
….ఏమి సొగసు…..
విశాల ఫాల భాగముపై తుమ్మెద గుంపుల వోలె ముంగురులు ముసరగా………….
శంఖముల వంటి కర్ణేంద్రియముల కర్ణాభరణములు శోభిల్లగా
...ఏమి సొగసు ……
అందమగు హస్తముల గాజుల ధ్వనితో
కటిఖ చిత్త మేఖల మువ్వల సవ్వడితో
కరకంకణముల అందెల రవళుల
అందాల భరిణ తన హంస నడకతో
….ఏమి సొగసు….
ఆహా... ఏమి సొగసు ఈ సీతది..3
16..త్రిపుర సుందరి
అమృత వర్షిణి రాగం , ఆదితాళం
పల్లవి :
త్రిపుర సుందరి నాపై నీదయ చూపుము….
త్రిపుర సుందరి నాపై నీదయ చూపుము….
అపరిమితానందా అమృత వర్షిణి…..
…త్రిపుర సుందరి నాపై నీదయ చూపుము…..ఉ..ఉ..ఉ..ఉ..
అను పల్లవి :
అపర దయానిధి నివేయని నమ్మి
పరులనెవరిని… ఆశ్రయించలేదే
త్రిపుర సుందరి నాపై నీదయ చూపుము..
చరణం :
గౌరి నీపాదము భక్తితో పూజింప
క్రమమును తెలియని పామరుల.మే
వారిజలోచని వేగమే వచ్చి
కోరన వరముల నొసగుము లలితమ్మ
*వారిజలోచని వేగమే వచ్చి*
కోరిన వరముల నొ..స...గు..ము లలితమ్మ
త్రిపుర సుందరి నాపై నీదయ చూపుము
అపరిమితానందా అమృత వర్షిణి…
త్రిపుర సుందరి నాపై నీదయ చూపుము…….
17. సామజ వరగమన
త్యాగరాజకృతి , హిందోళరాగం ,ఆదితాళం
పల్లవి :
సామజ వరగమన
సామజవరగమన సాధుహృత్సార
సార సాబ్జ పాల కాలాతీత విఖ్యాత
సామజవరగమనా
అను పల్లవి :
సామనిగమనిజ సుధా మయ గాన విచక్షణ గుణశీల దయాల వాల మాం పాలయ
చరణం :
వేద శిరో మాతృజ సప్త స్వర
నాద చల దీప స్వీకృత
యాదవకుల మురళీ వాదన
వినోద మోహన కర త్యాగరాజ వందనీయ
18.భో శంభో శివశంభో స్వయంభో
రేవతి రాగం, ఆదితాళము
రచన : శ్రీ దయానంద సరస్వతి
పల్లవి :
భో శంభో శివశంభో స్వయంభో
భో శంభో శివశంభో స్వయంభో
భో శంభో శివశంభో స్వయంభో
..భో శంభో శివశంభో స్వయంభో…..
అను పల్లవి :
గంగాధరా శంకర కరుణాకర మామవ భవసాగర తారక
భో శంభో శివశంభో స్వయంభో…..
భో శంభో శివశంభో స్వయంభో
చరణం :
నిర్గుణ పరబ్రహ్మ స్వరూప
గమగమ భూత ప్రపంచ రహిత
నిజగుహ నిహిత నితాంత అనంత
ఆనంద అతిశయ అక్షయ లింగా
భో శంభో శివశంభో స్వయంభో…..
భో శంభో శివశంభో స్వయంభో
ధిమిత ధిమిత ధిమి ధిమికిట కిటతోం
తోం తోం తరికిట తరికిట కిటతోం
మతంగ మునివర వందిత ఈశా
సర్వ దిగంభర వేశ్టిత వేశా
నిత్య నిరంజన నృత్య నటేశా
ఈశా సభేశా సర్వేశా…
భో శంభో శివశంభో స్వయంభో…..
గంగాధరా శంకర కరుణాకర మామవ భవసాగర తారక
భో శంభో శివశంభో స్వయంభో
శివశంభో స్వయం భో
శివశంభో స్వయంభో
19.చల్లరే రామ చంద్రుని పై పూలు
త్యాగరాజ స్వామి కీర్తన….. ఆహిరి రాగం ….. మిశ్రమ చాపు తాళం …
చల్లరే రామచంద్రుని పై పూలు
సొంపైన మనసుతో ఇంపైన
బంగారు ....
గంపలతో మంచి చంపకములను..చల్లరే రామచంద్రుని పై పూలు
ధాత్రు వినుతుడైన సీతాపతి పైన
చేతులతో పారిజాత సుమములను
….చల్లరే రామచంద్రుని పై పూలు...
ఈ జగతిని దేవ పూజార్హమౌ పూల
రాజిలో మేలైన జాజి సుమములను
. ..చల్లరే రామచంద్రుని పై పూలు...
ఎన్నరాని జనన మరణములు లేకుండా
మనసారా త్యాగరాజనుతినిపైన
చల్లరే రామచంద్రుని పై పూలు
రామచంద్రుని పై పూలు
రామచంద్రుని పై పూలు
20.సింగార మూర్తివి
కమాస్ రాగం
అన్నమయ్య సంకీర్తన
పల్లవి ,:
సింగార మూర్తివి చిత్తడ గురుడువు
చక్కగ జూసేరు మిము సాసముక
….సింగార మూర్తివి…..
చరణం :
పువ్వుల తెప్పల మీద పొలతులు నీవు నెక్కి
పువ్వుల ఆకాశము మోప పూచి చల్లుచు
దేవ దుందుబులు మ్రోయ దేవతలు కొలువగా
సామధానమగు నీకు సాసముక
…..సింగార మూర్తివి….
అంగరంగ వైభవాల అమర కామినులాడ
నింగి నుండి దేవతలు నిను జూడగ
సంగీత తాళవాద్య కాటు రాటలు మీరయగ
సంగది దెలిపి నీకు సాసముక
…..సింగార మీర్తివి…..
పరగ కోనేడిలోన పసిడి మీద నుండి
అరిడి ఇందిరాయు నీవు ఆరగించి
గరిమ శ్రీ వేంకటేశ కన్నుల పండువగాగా
సరవినోలడు సాసముక
…….సింగార మూర్తివి……
21.గంధము పూయరుగా
పున్నాగ వరాళి రాగం, తిశ్రగతి తాళంత్యాగరాజకృతి
పల్లవి :
గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా
అందమైన యదునందనుపై
కుందర ధన లిరు వందగ పరిమళ గంధము పూయరుగా
చరణం :
తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా
కళ కళ మను ముఖ కళగని సొక్కుచు
పలుకుల నమృతము లొలికే స్వామికి
తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా
చేలము గట్టరుగా బంగారు చేలము
గట్టరుగా
మాలిమితో గోపాలబాలురతో
ఆలమేపిన విశాల నయనునికి
చేలము గట్టరుగా బంగారు చేలము గట్టరుగా
హారతులెత్తరుగా ముత్యాల హారతులెత్తరగా
నారీమణులకు వారము యవ్వనవారక యొసగెడి వారిజాక్షునికి
హారతులెత్తరుగా ముత్యాల హారతులెత్తరుగా
పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
జాజులు మరి విరజాజులు దవనము
రాజిత త్యాగరాజనుతునికి
పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా
తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా
చేలము కట్టరుగా బంగారు చేలము కట్టరుగా
హారతులెత్తరుగా ముత్యాల హారతులెత్తరగా
పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా
22హెచ్చరికగా రారా హే రామచంద్రా
ఉత్సవ సాంప్రదాయ త్యాగరాజ కీర్తన
యదుకుల కాంభోజి రాగం,
ఖండచాపు తాళం
పల్లవి :
హెచ్చరికగా రారా , హే రామచంద్ర
హెచ్చరికగా రారా హే సుగుణ సాంద్ర
అను పల్లవి :
పచ్చవిల్తుని గన్న పాలిత సురేంద్ర..2
హెచ్చరికగా రారా హే రామచంద్ర
హెచ్చరికగా రారా హే సుగుణ సాంద్ర
చరణం :
కనకమయమౌ మకుట కాంతి మెరయగను
ఘనమైన నూపుర యుగంబు ఘల్లనను
సనకాదులెల్లగని సంతసిల్లగను
…..హెచ్చరికగా రారా……
ఆణి ముత్యాల సరులల్లలాడగను
వాణీ పతీంద్రులిరు వరుస పొగడగను
మాణిక్య సోపానమందు మెల్లగను
వీణ పలుకుల వినుచూ వేడ్క చెల్లగను
…….హెచ్చరికగా రారా……
నిను చూడ వచ్చు భగిని కరంబు చిలుక
మనసు రంజిల్ల నీ మహిమలను పలుక
మిను వాసులెల్ల విరులను చాల చిలుక
ఘన త్యాగరాజు కనుగొన ముద్దు గులుక
హెచ్చరికగా రారా , హే రామచంద్ర
ఓ రామచంద్ర. హే రామచంద్ర
23. బ్రహ్మకడిగిన పాదము
పల్లవి :
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెనీ పాదము ll
చరణం :
చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలితల మోపిన పాదము
తలకక గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము ll
కామిని పాపము కడిగిన పాదము
పాము తలనిడిన పాదము
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము ll
బ్రహ్మ కడిగిన పాదము..
పరమయోగులకు పరి పరి విధముల
పర మొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమపదము నీ పాదము ll
24.పసిడి అక్షింతలివే
సురుటి రాగము, ఆదితాళం
పల్లవి :
పసిడి అక్షింతలివే పట్టరో వేగమే రారో
దెసల పేరంటాండ్లు దేవుని పెండ్లికిని
చరణం :
శ్రీ వెంకటేశ్వరునికి శ్రీమహాలక్ష్మికి
దైవికపు పెండ్లి ముహుర్తము నేడు
కావించి బౌరులు మ్రోసే గరుడధ్వజం బెక్కె
…...పసిడి అక్షింతలివే…….
కందర్ప జనకునికి కమాలాదేవికి పెండ్లి
పందిరి లోపల తలంబాలు నేడు
గంధము విడె మిచ్చేరు కలువడాలు గట్టిరి
అందుక మునులు రారో హరి పెండ్లికిని
… పసిడి అక్షింతలివే…...
అదె శ్రీవేంకటపతికి అలమేలు మంగకును
మొదటి తిరునాళ్ళకు మొక్కేము నేడు
యెదుట నేగేరు మీరె యిచ్చేరు వరములివె
కదలి రారోపరుష ఘనుల పెండ్లికిని
...పసిడి అక్షింతలివే…….
25.సీతా కళ్యాణ వైభోగమే
శంకరాభరణ రాగం, ఖండచాపు తాళం
పల్లవి :
సీతా కళ్యాణ వైభోగమే రామా కళ్యాణ వైభోగమే
చరణం :
పవనజా స్తుతి పాత్ర పావన చరిత్ర
రవి సోమ వరనేత్ర రమణీయ గాత్ర
…..సీతా….
భక్త జన పరిపాల భరిత శరజాల
భుక్తి ముక్తిద లీల భూదేవ పాల
….సీతా ….
పామరాసుర భీమ పరిపూర్ణ కామ
శ్యామ జగదభి రామ సాకేత ధామ
…...సీతా….
సర్వ లోకాధార సమరైక ధీర
గర్వ మానస దూర కనకాంగ వీర
…..సీతా…..
నిగమాగమ విహార నిరుపమ శరీర
నగధ రాఘ విధార నత లోకధారా
…..సీతా…..
పరమేశనుత గీత భవ జలధి పోత
ధరణి కుల సంజాత త్యాగరాజ
నుత
…..సీతా……
సౌభాగ్యమే….వైభోగమే
సీతా కళ్యాణమే… రామ వైభోగమే
కళ్యాణమే ….వైభోగమే
26.యత్ర యత్ర రఘునాధ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణ లోచనమ్
మారూతిం నమత రాక్షతాంతకమ్.
27.రామచంద్రాయ
రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభిష్టదాయ మహిత మంగళం
కౌశలేశాయ మందహస దాసపోషకాయ
వాసవాది వినుత సద్వరాయ మంగళం
చారు మేఘ రూపాయ చందనాది చర్చితాయ భాన కటక శోభితాయ భూరి మంగళం
లలిత రత్న కుండలాయ తులసీ వనమాలికాయ జలజ ఘతుక దేహాయ చారు మంగళం
దేవకి సుపుత్రాయ దేవదేవోత్తమాయ చావజాత గురువరాయ సర్వ మంగళం
పుండరీకాక్షాయ పూర్ణ చంద్రననాయ అండజాత వాహనాయ అతుల మంగళం
విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభగ మంగళం
రామదాస మృదుల హృదయ కమల వాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం
సర్వ మంగళం...సర్వమంగళం
******************