27, మార్చి 2018, మంగళవారం

Ravaiah bhadrachala ram రావయ్య భద్రాచల రామ

రావయ్య భద్రాచల రామ
రచన : శ్రీ రామదాసు
ఆనందభైరవిరాగం, ఆదితాళం
స్వర రచన : శ్రీ నేదునూరి క్రిష్ణమూర్తిగారు
చిట్ట స్వరం : శ్రీ యరగొల్ల శ్రీనివాస యాదవ్
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరి గారు
Audio
పల్లవి :
రావయ్య భద్రాచల రామ శ్రీరామ
రమణీయ జగదభి రామ లలామా
….రావయ్య…….
అనుపల్లవి :
కేవల భక్తి విలసిల్లగ
భావము తెలిపిన దేవుడవైతే
….రావయ్య…...

చరణం :
ప్రొద్దు ప్రొద్దున నిన్నూ పొగడచునెప్పుడు
పద్దు మీరగను భజన చేసెదను
గద్దరి తనమున ప్రొద్దులు పూచుచు
ముద్దులు గులుకుచు మునపటి వలె నిటు
…..రావయ్య……

చిట్ట స్వరం :
పదప ‘సనిదపా మపమ నిదపమా
గమప పమగరి సగరి మగరిసా (గమ)
సనిదని సగరి మగరిసా సనిదని
సగరి మగరిసా నిదపమ గరిగమ
…..రావయ్య…..

దోషము లెంచని దొరవని నీకు
దొసిలొగ్గితిని తొలుత పరాకు
దాసుని తప్పులు దండముతో దీరు
మీసము కలిగిన దాసపోషకుడై
…….రావయ్య భద్రాచల రామ శ్రీరామ
రమణీయ జగదభి రామ లలామా...
రావయ్య భద్రాచల రామా….2

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి