22, జూన్ 2019, శనివారం

ఈతడే ముక్తిదోవ eetade muktidova

ఈతడే ముక్తిదోవ
అన్నమయ్య సంకీర్తన
రాగం : గంభీరనాట , తాళం : ఆది(తిశ్రగతి)
గానం,స్వర రచన : సత్తిరాజు వేణుమాధవ్ గారు
Audio
పల్లవి :
ఈతడే ముక్తిదోవ యీతడే మా ఆచార్యుడు
ఈతడు గలుగబట్టి ఇందరు బతికిరి
ఈతడే ముక్తిదోవ యీతడే మా ఆచార్యుడు….

చరణం :
అదివో తాళ్ళపాక అన్నమాచార్యులు
యిదెవీడె శ్రీవేంకటేశు నెదుట
వెదబట్టి లోకములో వేదములన్నియు మంచి
పదములు చేసి పాడి పావనము సేసెను
..ఈతడే….

అలరుచు తాళ్ళపాక అన్నమాచార్యులు
నిలిచి శ్రీవేంకటనిధియే తానై
కలిదోషములు వాప ఘనపురాణములెల్ల
పలుకుల నించి నించి పాడినాడు హరిని
….ఈతడే…..

అంగవించె తాళ్ళపాక అన్నమాచార్యులు
బంగారు శ్రీవేంకటేశు పాదములందు
రంగుమీర శ్రీవేంకటరమణుని యలమేలు
మంగను యిద్దరి బాడి మమ్ము కరుణించెను
….ఈతడే ముక్తిదోవ యీతడే మా ఆచార్యుడు
ఈతడు గలుగబట్టి ఇందరు బతికిరి
ఈతడే ముక్తిదోవ యీతడే మా ఆచార్యుడు….


బారసాల barasala

బారసాల.....
    ‘అమ్మ’
         అమ్మ అయిన వేళ ఆ స్త్రీ  కి ఎంత ఆనందం!!! గర్వం!!!.....
        తనను మాతృమూర్తిగా, పూనర్జన్మనిచ్చిన చిన్నారికి ఎన్ని ఊసులు చెప్పుకుంటూ, బాసలు చేసుకుంటుందో కదా.......!!!!!!
       తనని పరిపూర్ణ స్త్రీ గా నిరూపించిన తన  బంగారు బిడ్డకి అన్ని వేళలా తోడుగా ఉంటూ ప్రతిక్షణం తనదిగా, తన లోకంగా ఉండే చిన్నారి బిడ్డకు తొలుత చేసే ముచ్చటైన వేడుక బారసాల.
        అమ్మా,నాన్నలను చేస్తూ ఆ పిలుపును తమకు అందిస్తున్న చిన్నారికి, తన ఇంట్లోకి వచ్చిన కొత్త బంగారానికి(ప్రాణికి),తన రాకతో  ఆనందం, సంతోషాలను సమకూరుస్తూ అందరిని తనదైన పిలుపుతో(వరుసతో) అమ్మా, నాన్న, తాత,మామ్మ, (నానమ్మ), అక్క, అన్న, మామయ్య, అత్తయ్య,వదిన, బావ,అమ్మమ్మ,తాతయ్య అంటూ ముద్దులోలికే పిలుపులకు గర్వకారణమైన, వంశానికి వంశోద్దారకులై, పేరుప్రతిష్టలతో అడుగిడిగే చిన్నారికి చేసే ప్రధమ వేడుక బారసాల.
         ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు రూపుమారి ఉద్యోగ,వ్యాపార మరియు వాణిజ్యాలు  కారణంగా అందరూ దూరంగా దూరదేశాలలో (వివిధ ప్రదేశాలలో) ఉండవలసి ఉండటంవల్ల మన పద్దతులు, సాంప్రదాయాలు, వేడుకలు  ఏలా జరుపుకుంటారో చాలామందికి తెలియదు. ఉమ్మడి కుటుంబాలలోఉన్న వారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే పెద్దవారు ఎప్పటికప్పుడు అన్ని వేడుకలు,పద్దతులు ఎలా చేయాలో, ఎలా ఉండాలో చెబుతూఉంటారు.
మరి చిన్న కుటుంబాలు, దూరాల్లో ఉన్న మన తెలుగు వారికి వేడుకలు గురించి,ఎలా చేసుకుంటారో  వాటి వివరాలు ఈవిధంగా.....