25, జులై 2019, గురువారం

Varalakshmi mayamma వరలక్ష్మీ మాయమ్మా

వరలక్ష్మీ మాయమ్మా
వరలక్ష్మీదేవి హారతి పాట(మంగళహారతులు)
రాగం : ఆనందభైరవి , తాళం :మిశ్రగతి
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
చరణం :
వరలక్ష్మీ మాయమ్మ సిరులియ్యవమ్మ
పరమ పావనివమ్మ బంగారు బొమ్మ
వరలక్ష్మీ మాయమ్మ….

పల్లవి :
మల్లెలు మొల్లలు కొల్లలుగా తెచ్చి
తెల్లా కలువలతోటి దేవీ పూజింతు
వరలక్ష్మీ మాయమ్మ సిరులియ్యవమ్మ
పరమ పావనివమ్మ బంగారు బొమ్మ
వరలక్ష్మీ మాయమ్మ…..

క్షీరాబ్ధి తనయ సింహాసనమిత్తు
పసుపు కుంకుమ నిచ్చి దేవీ దీవించు
వరలక్ష్మీ మాయమ్మ సిరులియ్యవమ్మ
పరమ పావనివమ్మ బంగారు బొమ్మ
వరలక్ష్మీ మాయమ్మ….

శుక్రవారపు లక్ష్మీ సుజ్ఞానములీయవమ్మ
కోరీ హారతులిత్తు గైకొనవమ్మా
వరలక్ష్మీ మాయమ్మ సిరులియ్యవమ్మ
పరమ పావనివమ్మ బంగారు బొమ్మ
వరలక్ష్మీ మాయమ్మ… వరలక్ష్మీ మాయమ్మ…. వరలక్ష్మీ రావమ్మ…….

22, జులై 2019, సోమవారం

Sriramuni talli uyyalo శ్రీరాముని తల్లి ఉయ్యాలో

శ్రీరాముని తల్లి ఉయ్యాలో
గానం : శ్రీమతి శ్రీలక్ష్మీ . యాస్కి
Audio
శ్రీరాముని తల్లి ఉయ్యాలో
శ్రీమతి కౌసల్య ఉయ్యాలో

ప్రేమతో శాంతనూ ఉయ్యాలో
పిలిచి దగ్గర తీసే ఉయ్యాలో

చల్లని మాటలు ఉయ్యాలో
సతి ధర్మములు కొన్ని ఉయ్యాలో

చెప్పెనూ ఈ రీతి ఉయ్యాలో
చెవులకూ ఇంపుగా ఉయ్యాలో

అత్తమామల సేవ ఉయ్యాలో
ఆనందముగా చేసి ఉయ్యాలో

కలిగి యున్నంతలో ఉయ్యాలో
కనిపెట్టి ఉండవలే ఉయ్యాలో

పేదరికము చూసి ఉయ్యాలో
ప్రీతి దప్పకు తల్లి ఉయ్యాలో

వెనక ముందనకుండ ఉయ్యాలో
వేగిరా పడవద్దు ఉయ్యాలో

మాట జారిన వెనుక ఉయ్యాలో
మళ్ళి తిరిగి రాదు ఉయ్యాలో

అందుకే ముందుగా ఉయ్యాలో
ఆలోచన ఉండాలి ఉయ్యాలో

ఇరుగు పొరిగిండ్లకు ఉయ్యాలో
తిరగ బోవద్దమ్మ ఉయ్యాలో

భర్త  దైవంబని ఉయ్యాలో
భావించి పూజించే ఉయ్యాలో

వారిపై నీ ప్రేమ ఉయ్యాలో
వాసుదేవుని పూజ ఉయ్యాలో

వారిపై నీ ప్రేమ ఉయ్యాలో
వైకుంఠమందున ఉయ్యాలో

కొడుకులు బిడ్డలు ఉయ్యాలో
కొమరొప్ప కలగని ఉయ్యాలో

నిండు ముత్తైదవై ఉయ్యాలో
యుండవే మాతల్లి ఉయ్యాలో

పోయిరా శాంతమ్మ ఉయ్యాలో
పోయిరా మా తల్లి ఉయ్యాలో

పోయి మీ అత్తింట్ల ఉయ్యాలో
బుద్ధి గలిగి ఉండు ఉయ్యాలో


21, జులై 2019, ఆదివారం

Jaya lakshmi vara lakshmi జయలక్ష్మీ వరలక్ష్మీ

జయలక్ష్మీ వరలక్ష్మీ
అన్నమయ్య సంకీర్తన( లక్ష్మీ దేవి పాటలు )
రాగం : లలిత , తాళం : రూపక
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు

Audio
పల్లవి :
జయలక్ష్మీ వరలక్ష్మీ ……
జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ
ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా….
జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ……

చరణం :
పాలజలనిధిలోని పసనైన మీగడ
మేలిమి తామెరలోని మించు వాసన
నీలవర్ణునురముపై నిండిన నిధానమవై
ఏలేవు లోకములు మమ్మేలవమ్మా ...అమ్మా
...జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ

చందురు తోడబుట్టిన సంపదల మెరుగవో
కందువ బ్రహ్మల గాచే కల్పవల్లివో
అందిన గోవిందునికి అండనే తోడు నీడై
వుందానవు మా యింటనే వుండవమ్మా ...అమ్మా
….జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ

పదియారు వన్నెలతో బంగారు పతిమ
చెదరని వేదముల చిగురు బోడి
ఎదుట శ్రీ వేంకటేశు నిల్లాలవై నీవు
నిధుల నిలిచే తల్లి నీవారమమ్మా ....అమ్మా

...జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ
ప్రియురాలివై హరికి బెరసితివమ్మా.అమ్మా
జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ
వరలక్ష్మీ..జయలక్ష్మీ….…...

19, జులై 2019, శుక్రవారం

Venkatesudayaiah uyyalo వెంకటేశుడవయ్యా ఉయ్యాలో

వెంకటేశుడవయ్యా ఉయ్యాలో
గానం : శ్రీమతి శ్రీలక్ష్మీ.యాస్కి
Audio
వెంకటేశుడవయ్యా ఉయ్యాలో
వెన్నుడవయ్యా ఉయ్యాలో

ఎట్లా నిలిచితివయ్యా ఉయ్యాలో
ఈ గట్ల నడుమ ఉయ్యాలో

గట్లున్న గావమ్మ ఉయ్యాలో
కనక శ్రీమేడలో  ఉయ్యాలో

మేడాలు గావమ్మ ఉయ్యాలో
మేలి శిఖరాలు ఉయ్యాలో

శిఖరాలు కావమ్మ ఉయ్యాలో
శ్రీరామ గుడులు ఉయ్యాలో

శ్రీరామ గుడి కాడ ఉయ్యాలో
ఏరామ గుడులు ఉయ్యాలో

ఏరామ గుడికాడ ఉయ్యాలో
ఎదురెండలొచ్చె ఉయ్యాలో

ఏవించే సారంగి ఉయ్యాలో
నారింగ వనమూ ఉయ్యాలో

నారింగ వనమునకు ఉయ్యాలో 
నీళ్ళే లేవన్న ఉయ్యాలో

కురిపించే జలగంగ ఉయ్యాలో
కుంభా వర్షమూ ఉయ్యాలో

కుంభ వర్షము కురిసే ఉయ్యాలో
సాంబావరి పండే ఉయ్యాలో

సాంబవరి బియ్యంబు ఉయ్యాలో
ఛాయేగల పసుపు ఉయ్యాలో

స్వామి వేంకటపతికి ఉయ్యాలో
తలబాలు పోతూ ఉయ్యాలో

స్వామి వేంకటపతికి ఉయ్యాలో
తలబాలు పోతూ ఉయ్యాలో
ఉయ్యాలో...ఉయ్యాలో , ఉయ్యాలో...ఉయ్యాలో ,ఉయ్యాలో...ఉయ్యాలో
ఉయ్యాలో...ఉయ్యాలో

18, జులై 2019, గురువారం

Enta chakkanidamma uyyalo ఎంత చక్కనిదమ్మ ఉయ్యాలో

ఎంత చక్కనిదమ్మ ఉయ్యాలో
గానం : శ్రీమతి శ్రీలక్ష్మీ . యాస్కి
పల్లవి :
ఎంత చక్కనిదమ్మ ఉయ్యాలో
కాశీ గౌరమ్మ ఉయ్యాలో
ఏవేళ చూసిన ఉయ్యాలో 
నీ పూజాలమ్మా ఉయ్యాలో

ఏవంక చూచిన ఉయ్యాలో
శృంగారమమ్మా ఉయ్యాలో
ఏడు కోటల నడుమ ఉయ్యాలో
ఘనమైన కోట ఉయ్యాలో
ఘనమైన కోటలో ఉయ్యాలో
ఈశ్వరుని గుడి ఉయ్యాలో
….ఎంత చక్కనిదమ్మ ఉయ్యాలో
కాశీ గౌరమ్మ ఉయ్యాలో…..

అచ్చమావుల పాలు ఉయ్యాలో
అభిషేకామమ్మా ఉయ్యాలో
పచ్చి టెంకాయలు ఉయ్యాలో
ఫలహారాలమ్మ ఉయ్యాలో
…..ఎంత చక్కనిదమ్మ ఉయ్యాలో
కాశీ గౌరమ్మ ఉయ్యాలో….

మల్లెలు మొగ్గలు ఉయ్యాలో
మగువా హారాలు ఉయ్యాలో
చేమంతి పుష్పములు ఉయ్యాలో
సేడే హారములు ఉయ్యాలో
…..ఎంత చక్కనిదమ్మ ఉయ్యాలో
కాశీ గౌరమ్మ ఉయ్యాలో….

పండ్లు ఫలహారములు ఉయ్యాలో
నైవేద్యాలమ్మ ఉయ్యాలో
ఎంత చక్కనిదమ్మ ఉయ్యాలో
కాశీ గౌరమ్మ ఉయ్యాలో
ఏవేళ చూసిన ఉయ్యాలో 
నీ పూజాలమ్మా ఉయ్యాలో
ఏవంక చూచిన ఉయ్యాలో
శృంగారమమ్మా ఉయ్యాలో
….ఎంత చక్కనిదమ్మ ఉయ్యాలో
కాశీ గౌరమ్మ ఉయ్యాలో….

ఉయ్యాలో ఉయ్యాలో -- ఉయ్యాలో ఉయ్యాలో--ఉయ్యాలో ఉయ్యాలో...ఉయ్యాలో ఉయ్యాలో