22, జులై 2016, శుక్రవారం

వరలక్ష్మీ తల్లి రావమ్మ Varalakshmi Talli Ravamma

వరలక్ష్మీ తల్లి రావమ్మ
Varalakshmi Talli Ravamma

AUDIO


రచన: దేవులపల్లి శ్రీదేవి…...సంగీతం: ప్రణవి మొక్కరాల
మళయమారుత రాగం
ఏకతాళం

వరలక్ష్మీతల్లి రావమ్మ
వరముల నొసగుచు రావమ్మ


వైభవమ్ముగా అలంకరించి
వనితలందరు ఆరాధింతురు
అష్టైశ్వర్యము ప్రసాదించమని
భక్తితో నిన్ను వేడుకొందురు...వరలక్ష్మీ..


శ్రావణమాస శుక్రవారము
నిను సేవించి పూజలు చేసి
గారెలు బూరెలు చిత్రాన్నములు
పాయసాన్నపు నైవేద్యములు...వరలక్ష్మీ…


ముతైదువుల ఇంటికి పిలిచి
బొట్టును పెట్టి గంధము పూసి
పసుపును రాసి పూలను ఇచ్చి
తాంబూలమిడి సత్కరింతురు...వరలక్ష్మీ…


సౌభాగ్య మోసగే తల్లివి నీవని
పడతుల పాలిటి కల్పవల్లి వని
భక్తితో నిను ఆరాధింతురు
సంతోషముతో తృప్తి చెందెదరు.. .వరలక్ష్మీ…



Varalakshmi Talli Ravamma
Rachana: Devulapalli Sridevi
Sangeetam: Pranavi Mokkarala
Malayamarutha ragam
Eka Talam


Varalakshmi talli ravamma
Varamula nosaguchu ravamma


Vibhavammuga alamkarinchi
Vanitalandaru aaradhinturu
Astaiswaryamulu prasadhinchamani
Bhathi to ninnu vedukonduru...varalakshmi...


Sravanamasa sukravaramu
ninu sevinchi poojalu chesi
Garelu burelu chitrannamulu
Payasannapu naivedyamulu...varalakshmi...


Muthaiduvula intiki pilachi
Bottunu petti gandhamu pusi
Pasupunu raasi pulanu ichhi
Tambulamidi satkarinturu...varalakshmi...


Sowbhagya mosagay tallivi nevani
Padathula paliti kalpavalli vani
bhati to ninnu aaradhinturu
santosham to trupthi chendedaru...varalakshmi...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి