బాలా త్రిపుర సుందరి
రచన : ప్రయాగ రంగ దాసు గారు
స్వర రచన : బాల మురళి క్రిష్ణ గారు
భజన పాట…..తిశ్రగతి..ఏకతాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు.
Audio
పల్లవి :
సుందరి…..త్రిపుర సుందరి…..
బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి
గానలోల జాలమెలా దారి చూపుమా...
చరణం :
సుందరాంగి అందరు నీ సాటిరారుగా
సందేహములు అందముగా తీర్పుమంటిని
వాసికెక్కి యున్న దానవనుచు నమ్మితి
రాసిగ సిరి సంపదలిచ్చి బ్రోవుమంటిని
ఓం హ్రీం శ్రీం యనచు మదిని తలచుచుంటిని
ఆపద లెడ బాపవమ్మ అతివ సుందరి
స్థిరముగ శ్రీకడలి యందు వెలసితివమ్మా
ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా
బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి
బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి
గానలోల జాలమెలా దారి చూపుమా...
గానలోల…...గానలోల……
గానలోల జాలమెలా దారి చూపుమా.
దారి చూపుమా…..దారి చూపుమా.
దారి చూపుమా………..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి