12, ఆగస్టు 2016, శుక్రవారం

క్రిష్ణా క్రిష్ణానది క్రిష్ణవేణీనది Krishna krishna Nadi

క్రిష్ణా క్రిష్ణానది క్రిష్ణవేణీనది

రచన,  సంగీతం : శ్రీమతి వేమూరి సరోజని శాస్త్రిగారు
శుద్ధధన్యాసి రాగం  ఏకతాళం

 AUDIO


క్రిష్ణా క్రిష్ణానది క్రిష్ణవేణీనది
కరుణించి కాపాడు కలకాలము తల్లి
క్రిష్ణా…..క్రిష్ణానది…..

మహాభక్తులు ఉదయించిన మహారాష్ట్ర నుండి కదిలి
పయనించి పయనించి తెలుగువారి నుద్దరింప
పరుగు పరుగున వచ్చిన పరమ పావని జననీ…….
పరుగు పరుగున వచ్చిన పరమ పావని జనని
పవిత్రముగా చేయుమమ్మ జనులందరిని
క్రిష్ణా…..క్రిష్ణానది…..

క్రిష్ణుని భుజము నుండి పుట్టితివి కనుక
నీవు క్రిష్ణాయను నామము బడసితివమ్మా
మార్గమందు వేణీ నదితో కలసి నీవు
క్రిష్ణవేణిగా ప్రసిద్ధి చెందినావమ్మ
క్రిష్ణా…..క్రిష్ణానది…..

విజయవాటిక యందు కనకదుర్గమ్మను
ఆనంద కెరటాల అర్చింతువమ్మా
నీ తీర్ధమందున పావనులై భక్త జనులు
పుణ్యరాసులను పొంది తరయింతురే తల్లి
క్రిష్ణా…..క్రిష్ణానది…..

నీ జలముల గృంకులిడి పునీతులైన జనులు
పుష్కరుని కూడిన నిను పూజించి సేవించి
పితురులను ధ్యానించి తర్పణాదులను నొసగి
ఇహపర సుఖముల నెల్ల పొందెదరే తల్లి
క్రిష్ణా క్రిష్ణానది క్రిష్ణవేణీనది
కరుణించి కాపాడు కలకాలము తల్లి
క్రిష్ణా…..క్రిష్ణానది…..



Krishna krishna nadi
krishna veni nadi

Rachana, sangeetam : Srimati vemuri sarojini sastri garu
Sudda dhanyasi ragam,  ekatalam

Krishna krishna nadi krishnaveni nadi
Karuninchi kapadu kalakalamu talli
Krishna….. krishna nadi

Maha bhakthulu udayinchina Maharashtra nundi kadali
Payaninche payaninche telugu vari nuddarimpa
Parugu paruguna vachina parama pavani janani…..
Parugu paruguna vachina parama pavani janani
Pavitramuga cheyumamma janulandarini
Krishna…..krishna nadi…..

Krishuni bhujamu nundi puttitivi kanuka
Nevu krishna yanu namamu badasitivamma
Margamandu veni nadito kalasi neevu
Krishnaveni ga prasiddi chendinavamma
Krishna….krishna nadi…..

Vijayavatika yandu kanakadurgamma nu
Ananda keratala archintuvamma
Nee teertha manduna paavanulai bakta janulu
Punya rasulanu pondi tarainture talli
Krishna …….krishna nadi….

Nee jalamula gruntikalidi puneetulaina janulu
Pushkaruni kudina ninu pujinchi sevinchi
Piturulanu dhyaninchi tarpanadulanu nosagi
ihapara sukhamula nella pondedare talli

Krishna krishna nadi krishnaveni nadi
Karuninchi kapadu kalakalamu talli
Krishna….. krishna nadi







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి