29, ఆగస్టు 2016, సోమవారం

నా తెలుగు NAA TELUGU

నా తెలుగు
పల్లవి  :  
శ్రీకాకుళ పురి ఆంధ్రవిష్ణుని శ్రీకమలం నా తెలుగు
సాగర క్రిష్ణా సంగమ స్మృతిలో నవరాగం నా తెలుగు
చరణం  :
మువ్వ వేణు గోపాలుడూదే పిల్లన గ్రోవే నాతెలుగు
కులుకుల అలుకలు సత్యకు నేర్పే కూచిపూడియే నా తెలుగు..శ్రీకాకుళ…

ఆత్మా నాత్మా వివేకం తెలిపే హంసలదీవే నా తెలుగు
కవిని శివునిగా ఆరాధించే అవనిగడ్డయే నా తెలుగు...శ్రీకాకుళ…

పద్య పఠనమున పాప నాశనము చేసే మహిమే నా తెలుగు
నదిలో వేదం చదివి సూర్యునికి ఒసగే అర్ఘ్యం నా తెలుగు….శ్రీకాకుళ…

ప్రపంచమే తన స్వరముగా నిలిపిన మురళీ మాధురి నా తెలుగు
ఇంద్రకీలాద్రి చంద్రకళాధరి ముక్కు పుడకయే నా తెలుగు...శ్రీకాకుళ…

వేదాద్రి నగర శ్రీ నరసింహుని వేద హృదయమే నా తెలుగు...శ్రీకాకుళ…

వాన చినుకులకు బయటపడే వజ్రాల గుంటయే నా తెలుగు
వెన్న ఘుమ ఘుమల వెన్నల జున్నుల చల్లపల్లి యే నా తెలుగు...శ్రీకాకుళ…..
నవరాగం నా తెలుగు,  నవరాగం నా తెలుగు.


NAA TELUGU

PALLAVI:
SRIKAKULA PURI ANDHRA VISHNUNI SRI KAMALAM NAA TELUGU
SAGARA KRISHNA SANGAMA  LO NAVA RAGAM NAA TELUGU

CHARANAM :

MUVVA VENU GOPSLUDUDE PILLANA GROVE NAA TELUGU
KULUKULA ALAKALU SATYA KU NERPE KUCHIPUDIYE NAA TELUGU.
…..SRIKSKULA……

ATMA NATMA VIVEKAM TELIPE HANSALADEVE NAA TELUGU
KAVINI SIVUNI GA ARADHINCHE AVANI GADDA YE NAA TELUGU
…….SRIKSKULA…

PADYA PATANAMUNA PAPANASANAM CHESE MAHEME NAA TELUGU
NADILI VEDAM CHADIVE SURYUNIKI VOSAGE AARGYAM NAA TELUGU
....SRIKAKULA…..

PRAPAMCHAME TANA SARVAMUGA NILIPINA MURALI MADHURI NAA TELUGU
INDRA KILARDRI CHANDRA KALADHARI
MUKKU PUDAKAYE NAA TELUGU. …….. SRIKAKULA……

VEDADRI NAGARA SRI NARASHIMHUNI VEDA HRUDAYAME NAA TELUGU
…….SRIKAKULA…….

VAANA CHINUKULAKU BAYATA PADE VAJRALA GUNTAYE NAA TELUGU
VENNA GHUMA GHUMALA VENNALA JUNNULA CHALLA PALLIYE NAA TELUGU
…….SRIKAKULA………
NAVARAGAM NAA TELUGU...2








1 కామెంట్‌:

  1. పాప నవ్వువోలె పాల మీగడ వోలె
    మంచి గంధ మట్లు మల్లె లట్లు
    వీణ పాట రీతి విన సొంపుగా నుండు
    తీయ తేనె లొలుకు తెలుఁగు పలుకు

    రిప్లయితొలగించండి