రమ్మని వనభోజనం కమ్మని వన భోజనం
(కార్తీక మాసము పాట)
పుణ్య కార్తీక మందు కలుసుకుందామంటు ప్రేమతో పిలిచింది పూలవనము
భక్తి శ్రద్ధలతో కలసి విందామంటు ఆహ్వాన మందించే ఊరి జనము
ఐకమత్యము గూడి ఆధ్యాత్మిక తోడి
జగతి నడిచెడి ధర్మ మార్గ మెరిగి కలుసుకుందము రండి మిత్రులారా.
**********************************
పల్లవి :
రమ్మని వనభోజనం కమ్మని వన భోజనం
కార్తిక మాసంలో పవిత్ర పంక్తి భోజనం
చరణం :
సాంప్రదాయములకు లక్ష్మీ దామోదర పూజలు
ఆధ్యాత్మిక పరిమళాల అలరు భక్తి సేవలు
ఉసిరి చెట్టు నీడన ప్రకృతితో సహజీవనం
పల్లెతల్లి ఒడిలో పరవశపు విందుభోజనం
….రమ్మని వన భోజనం…..
ఆటపాటలతో సందడి చేసే పసిపాపలు
ఆత్మీయత పంచు బందుమిత్రుల చిరునవ్వులు
కలిపి తీపి గురుతుగా మిగిలేటి విందు భోజనం
….రమ్మని వన భోజనం…..
బ్రతుకు నిచ్చు ప్రకృతి మాతకు చేసే వందనం
భేద భావములు నెరగని మానవీయ సంగమం
మన సంస్కృతి ఘన ప్రతీక సమ్మేళనం
ఇది తెలిసిన నాడే నిజమైన విందుభోజనం
రమ్మని వనభోజనం కమ్మని వన భోజనం
కార్తీక మాసంలో పవిత్ర పంక్తి భోజనం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి