20, అక్టోబర్ 2016, గురువారం

శివుడు తాండవము చేయునమ్మా

శివుడు తాండవము చేయునమ్మా
Audio
శ్రీరాగం , ఆదితాళం
పల్లవి :
శివుడు తాండవము సేయునమ్మ.
శివుడు తాండవము సేయునమ్మ కైలాసగిరిలో
శివుడు తాండవము సేయునమ్మా

చరణం :
శివుడు తాండవము సేయును నిత్యము
అవిరళముగ జగదాంబ ముందర
..శివుడు తాండవము చేయునమ్మా…

సరస్వతి వీణ వాయించంగా  
లయ తప్పకుండా బ్రహ్మ తాళము వేయుచుండా
సారస గతులను సప్త తాళముల
భావము పుట్టగ ప్రదోష వేళ
….శివుడు తాండవము చేయునమ్మా…..

మురళి దేవేంద్రుడె పూరింపంగ
నారాయణ మూర్తి మురియుచు మద్దెలు వాయింప
తకధిమి తద్ధిమి తోంధిమి అనుచు
భరత శాస్త్రమును పలికిన రీతుల

శివుడు తాండవము సేయునమ్మ
కైలాస గిరిలో
శివుడు తాండవము సేయునమ్మ
శివుడు తాండవము సేయునమ్మ
శివుడు తాండవము సేయునమ్మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి