కాశీపతే వారణాశీ పతే
శివరంజని రాగం, ఆది తాళం
కాశీపతే వారణాశీ పతే
గంగా జటాఝూట గౌరీపతే
సర్వుల పాలించు సదా పశుపతే
గతి మాకు నీవయ్య గిరిజా పతే
...కాశీపతే….
భోళా శంకర హర గంగాధర
ఆనందకారణ విహార హర
అర్ధనారీశ్వర మహదేవ శంకర
ఆదుకో రావయ్య పరమేశ్వరా
….కాశీపతే…
కాశి కాశి యనగ నశియించు పాపములు
కాశీవాసుల భాగ్యమే భాగ్యము
తారక మంత్రమిది తరియింప చేతువట
సదా నిను తలచు మది కాశీయగునట
కాశీపతే వారణాశీ పతే
గంగా జటాఝూట గౌరీపతే
కాశీపతే వారణాశీ పతే
వారణాశీ పతే
వారణాశీ పతే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి