19, అక్టోబర్ 2016, బుధవారం

ఈశ్వరాజ్ఞ ఏమో eeswaragna emo

ఈశ్వరాజ్ఞ ఏమో eeswaragna emo
రచన : శ్రీ మళై కొండ రామదాసు,  సంగీతం : బాల మురళి కృష్ణా సింధు భైరవి రాగం,  రూపక తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
శ్వరాజ్ఞ ఏమో తెలియదు
అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ
చరణం :

శాశ్వత ఐశ్వర్య మిచ్చి సదా నన్ను బ్రోచునో

సకల భాధలను పెట్టి సంకట పడచూచునో…..పరమేశ్వరాజ్ఞ…..

నందనునిగ భావించి నన్ను గారవించునో

నలుగురి లోపల మిక్కిలి నగుబాటొనరించనో

…..పరమేశ్వరాజ్ఞ…..

ధారుణిలో నను భగవత్ దాస కోటి చేర్చునో

ధార పుత్రాది వలలో తగులు కొనగా కూర్చునో

…..పరమేశ్వరాజ్ఞ….

కూరిమితో సుదర్శనము గొప్పున దయ చేయునో

కొరమాలిన మానవులను కొనుయాడగ చేయునో

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు

అది ఎవరెరగరు ఈశ్వరాజ్ఞ

అది ఎవరెరగరు ఈశ్వరాజ్ఞ

అది ఎవరెరగరు ఈశ్వరాజ్ఞ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి