17, నవంబర్ 2016, గురువారం

షోడస కళానిధికి

షోడస కళానిధికి

లలితరాగం, ఆదితాళము

Audio

పల్లవి :

షోడస కళానిధికి షోడశోపచారములు
షోడస కళానిధికి షోడశోపచారములు
జాడతోడ నిచ్చలును సమర్పయా..మి
జాడతోడ నిచ్చలును సమర్పయామి..2

చరణం :
అలరు విశ్వాత్మకునకు ఆవాహన మిదె
సర్వ నిలయునకు ఆసనము నెమ్మి నిదే
అలగంగా జనకునకు అర్ఘ్య పాద్యా అచమనాలు
జలధి శాయికిని మజ్జన మిదే….
….......షోడస కళానిధికి ………...

వర పీతాంబరునకు వస్త్రాలంకార మిదె
సరి శ్రీమంతునకు భూషణము లివే
ధరణీ ధరునకు గంధ పుష్ప ధూపములు
తిరమిదే కోటి సూర్య తేజునకు దీపము
….......షోడస కళానిధికి ………...

అమృత మథునునకు అదివో నైవేద్యము

గమి చంద్ర నేత్రునకు కప్పుర విడెము
అమరిన శ్రీవెంకటాద్రి మీది దేవునకు
తమితో ప్రదక్షిణాలు దండములు ఇవిగో
….......షోడస కళానిధికి …………

షోడస కళానిధికి షోడశోపచారములు
జాడతోడ నిచ్చలును సమర్పయా..మి
జాడతోడ నిచ్చలును సమర్పయామి
సమర్పయామి…..సమర్పయామి. .....3

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి