తిరుమలగిరిరాయ
మోహన రాగం ,ఏక తాళం
అన్నమయ్య సంకీర్తన
Audio
తిరుమలగిరిరాయ…...
తిరుమలగిరిరాయ దేవరా హుక్తరాయ
సురత భిన్నాణరాయ సుగుణ కోనేటిరాయ
తిరుమలగిరి రాయ….
సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ….
సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ
సరస వైభవరాయ సకల వినోదరాయ
వర వసంతములరాయ వనితల విటరాయ
గురుతైన తేగరాయ కొండల కోనేటిరాయ
……..తిరుమగిరి రాయ….
గొల్లెతల ఉద్ధండరాయ గోపాలక్రిష్ణ రాయ….
గొల్లెతల ఉద్ధండరాయ గోపాలక్రిష్ణ రాయ
చల్లు వెద జాణరాయ చల్ల పరిమళరాయ
చెల్లుబడిన ధర్మరాయ చెప్పరాని వలరాయ
కొల్లలైన భోగరాయ కొండల కోనేటి రాయ
…...తిరుమలగిరి రాయ…..
సామ సంగీతరాయ సర్వ మోహనరాయ….ఆ.ఆ.ఆ.ఆ.
స రి గా ….రి గ పా….గ ప ద….ప ద సా….
స రి గా రి గ పా గ ప ద ప ద సా
గరి గరి సద ..రిస రిస దప .. సద సద పగ..
గప గరిస
గరిగరిసద రిసరిసదప సదసదపగ గపగరిస
సామ సంగీతరాయ సర్వ మోహనరాయ
ధామ వైకుంఠరాయ దైత్య విభాళరాయ
కామించి నిన్ను కోరితే కరుణించితివి నన్ను
శ్రీమంతుడా నీకు జయశ్రీ వేకంటరాయ
తిరుమలగిరి రాయ దేవరా హుక్తరాయ
సురత భిన్నాణరాయ సుగుణ కోనేటిరాయ
తిరుమలగిరి రాయ…
తిరుమలగిరి రాయ….
తిరుమలగిరి రా...య………
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి