8, ఫిబ్రవరి 2017, బుధవారం

Swetambara dharini శ్వేతాంబర ధారిణి

శ్వేతాంబర ధారిణి
రచన : డా. పి యల్ యన్ ప్రసాదుగారు
సంగీతం,  గానం : యం.యశోధరగారు
మోహనరాగం, ఏకతాళం


పల్లవి:
శ్వేతాంబర ధారిణి శ్వేతాంబర ధారిణి
శ్వేతహాసిని శ్వేత మరాళ విరసితా శ్వేత వరప్రదా
శ్వేతాంబర ధారిణి……..


చరణం :
సత్యస్వరూపమే భాసింపగా వేదజ్ఞానమే వాక్కున నిలుపుమా
స్వరరాగ సంచారముతో స్వరరాగ సంచారముతో
శృతి శుభ తత్వం మీయవే
ఇంద్రియ నిగ్రహము ఒసగు ఐంకార రూపిణి
విరించి వలపుల రాణి విరించి వలపుల రాణి
వసగామృతము మియ్యవే వాగ్దేవి…..
……….శ్వేతాంబర ధారిణి……….


శాస్త్ర జ్ణానమును సకల కళలను రసికులు మెచ్చగా రాగశోభలతో
ముచ్చటములకు మోదము కూర్చగా
ఓంకారమునే నా వాక్కున నిలుపుమా
శ్వేతాంబర ధారిణి శ్వేతాంబర ధారిణి
శ్వేతహాసిని శ్వేత మరాళ విరసితా శ్వేత వరప్రదా
……..శ్వేతాంబర ధారిణి……

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి