22, మే 2017, సోమవారం

Anjanedevikoduku hanumantudu అంజనీ దేవి కొడుకు హనుమంతుడు


అంజనీ దేవి కొడుకు హనుమంతుడు
భైరవి రాగం ,ఆదితాళం
గానం: మొక్కరాల కామేశ్వరీగారు

పల్లవి :
అంజనీ దేవి కొడుకు హనుమంతుడు
సంజీవిని తెచ్చినాడు సారె హనుమంతుడు

చరణం :
కలశాపురము కాడ కదళీవనాల నీడ
అలనాడె వున్నవాడు హనుమంతుడు
అలరు కొండల కోనల అందలి గుహలలోన
కొలువు సేయించుకొని కోరి హనుమంతుడు

పసలుగా జంగవెట్టి పండ్లగుత్తి చేతబట్టి
అసురులను వెళ్ళగొట్టి హనుమంతుడు
వసుధా ప్రతాపించి వడి తోక గదలించి
దిశలెల్లా పాలించి దివ్యహనుమంతుడు

వుద్దవిడి లంకచొచ్చి ఉంగరము సీతకిచ్చి
అదివో రాము మెప్పించి హనుమంతుడు
అద్దుక శ్రీవేంకటేశు కటుబంటై వరమిచ్చి
కొద్దిమీర సంతోషాలే గుప్పి హనుమంతుడు

4, మే 2017, గురువారం

పెరిగినాడు చూడరో | Periginadu Chudaro

పెరిగినాడు చూడరో
మోహనరాగం, ఆదితాళం
గానం : విద్యాభారతిగారు


పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు
పరగి నానా విద్యల బలవంతుడు


రక్కసుల పాలికి రణరంగ శూరుడు
వెక్కసపు ఏకాంగ వీరుడు
దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు
అక్కజమైనట్టి ఆకారడు


దేవ కార్యముల దిక్కువరేణ్యుడు   
భావింపకల తపః ఫల పుణ్యుడు  
శ్రీ వేంకటేశ్వర సేవాగ్రణ్యుడు
సావధానుడు సర్వశరణ్యుడు.

చక్కని తల్లికి చాంగు భళా | Chakkani Thalliki Changu Bhala

చక్కని తల్లికి చాంగు భళా
పాడిరాగం ,ఆదితాళం
గానం: విద్యాభారతిగారు

పల్లవి :
చక్కని తల్లికి చాంగు భళా...తన
చక్కెర మోవికి చాంగుభళా


చరణం :
కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సళుపు చూపులకు చాంగుభళా
పలుకుల సొలపుల పతితో కసిరెడి
చలముల యలుకకు చాంగుభళా


కిన్నెరతో పతి కెలన నిలుచు తన
చన్ను మెఱుగులకు చాంగుభళా
ఉన్నతి పతిపై నొరగి  నిలుచు తన
సన్నపు నడిమికి చాంగుభళా


జందెపు ముత్యపు సరుల హారముల
చందన గంధికి చాంగుభళా
విందై వేంకట విభు పెనచిన తన
సందిదండలకు చాంగుభళా


చక్కని తల్లికి చాంగు భళా...తన
చక్కెర మోవికి చాంగుభళా
భళా భళా భళా