చక్కని తల్లికి చాంగు భళా
పాడిరాగం ,ఆదితాళం
గానం: విద్యాభారతిగారు
పల్లవి :
చక్కని తల్లికి చాంగు భళా...తన
చక్కెర మోవికి చాంగుభళా
చరణం :
కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సళుపు చూపులకు చాంగుభళా
పలుకుల సొలపుల పతితో కసిరెడి
చలముల యలుకకు చాంగుభళా
కిన్నెరతో పతి కెలన నిలుచు తన
చన్ను మెఱుగులకు చాంగుభళా
ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి చాంగుభళా
జందెపు ముత్యపు సరుల హారముల
చందన గంధికి చాంగుభళా
విందై వేంకట విభు పెనచిన తన
సందిదండలకు చాంగుభళా
చక్కని తల్లికి చాంగు భళా...తన
చక్కెర మోవికి చాంగుభళా
భళా భళా భళా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి