నానాటిి బతుకు
రేవతిరాగం , ఆదితాళం
సంగీతం : నేదునూరి క్రిష్ణమూర్తిగారు
గానం : మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
నానాటి బతుకు నాటకము
నానాటి బతుకు నాటకము
కానక కన్నది కైవల్యము
నానాటి బతుకు నాటకము నాటకము
చరణం :
పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమీ పని నాటకము
యెట్ట నెదుట గలది ప్రపంచము
కట్ట కడపటిది కైవల్యము
నానాటి బతుకు నాటకము నాటకము
కుడిచే దన్నము కోక చుట్టెడిది నడుమంత్రపు పని నాటకము
ఒడిగట్టుగొనిన ఉభయ కర్మములు గడి దాటినప్పుడే కైవల్యము
నానాటి బతుకు నాటకము నాటకము
తెగదు పాపము తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము
యెగువనే శ్రీ వేంకటేశ్వరుడేలిక గగనము మీదిది కైవల్యము
నానాటి బతుకు నాటకము
కానక కన్నది కైవల్యము
నానాటి బతుకు నాటకము నాటకము
నాటకము నాటకము
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి