31, జులై 2017, సోమవారం

Kanti sukravaramu కంటి శుక్రవారము


Kanti sukravaramu
కంటి శుక్రవారము
ఆనందభైరవి రాగం ఆది/ఏక తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
అన్నమయ్య సంకీర్తన
Audio
పల్లవి :
కంటి శుక్రవారము గడియ లేడింట
అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని
కంటి….‌

చరణం :
సొమ్ములన్ని కడబెట్టి సొంపూతో గోణాము గట్టి
కమ్మని కదంబము కప్పు పన్నీరు
చెమ్మతోన వేష్టువలు రొమ్ము తల మొల చుట్టి
తుమ్మెద మైఛాయతోన నెమ్మది నుండె స్వామిని
కంటి….

పచ్చకప్పూరమే నూరి పసిడి గిన్నెల నించి
తెచ్చి శిరసాదిగా దిగనలది
అచ్చెర పడి చూడ అందరి కన్నుల కింపై
నిచ్చ మల్లె పూవు వలె నిటు తానుండె స్వామిని
కంటి….

తట్టు పునుగే కూరిచి చట్టలు చేరిచి నిప్పు
పట్టి కరిగించి వెండి పళ్యాల నించి
దట్టముగా మేను నిండా పట్టించి దిద్ది బిట్టు వేడుక
మురియు చుండె బిత్తరి స్వామిని
కంటి…….

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి