శ్రీలక్ష్మి వరలక్ష్మి
Srilakshmi varalakshmi
కళ్యాణి రాగం , ఖండ చాపు తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
శ్రీలక్ష్మీ వరలక్ష్మి శృంగారలక్ష్మి
మాలక్ష్మి రావమ్మ మమ్మేలు మమ్మా
అను పల్లవి :
గజ్జెలందెల కాళ్ళు ఘల్లు ఘల్లని మ్రోయ
కళ్యాణదేవిరో కదలి రావమ్మ
…….శ్రీలక్ష్మి వరలక్ష్మి……
చరణం :
పసిడి కంకణ రవళి దిశెలెల్ల మెరయగా
భాగ్యదేవతవేగా పాలింపుమమ్మా
ముక్కోటి దేవతలు ముదముతో కొలువగా
మావీధి కేతెంచి మమ్మేలుమమ్మా
…..శ్రీలక్ష్మి వరలక్ష్మి…...
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి