అరయా శ్రావణ బహుళ
araya sravana bahula
పాడి రాగం , ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
అరయా శ్రావణ బహుళ అష్టమి చంద్రోదయమున
సిరులతో నుదయించే శ్రీకృష్ణుడిదివో ...శ్రీక్రిష్ణుడిదివో
చరణం :
వసుదేవుని పాలిటి వర తపోధనమో
యొసగి దేవకి దేవి ఎదపై సొమ్ము
సుసరాన గొల్లెతల సొంపు మంగళ సూత్రము
శిశుడై ఉదయించే శ్రీక్రిష్ణుడిడివో
నందగోపుడు గన్న నమ్మిన నిధానమో
పొందగు యశోదకు పూజ దైవము
మందల యావులకును మంచి వజ్ర పంజరము
చెంది ఉదయించినాడు శ్రీక్రిష్ణుడిదివో
సేవచేసే దాసుల చేతిలోని మాణిక్యమో
శ్రీవేంకటాద్రి నేచిన బ్రహ్మము
వోపరి నలమేల్మంగ నురముపై బెట్టుకొని
చేవ చేర నుదయించే శ్రీక్రిష్ణుడిడివో
...అరయా…
శ్రీక్రిష్ణుడిడివో శ్రీక్రిష్ణుడిడివో శ్రీక్రిష్ణుడిడివో
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి