ఇట్టి ముద్దులాడి
itti mudduladi
ఆనందభైరవిరాగం , ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
ఇట్టి ముద్దు లాడి బాలుడేడవాడు వాని
పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే
చరణం :
గామిడై పారి తెంచి కాగెడి వెన్నలలోన
చేమ పూవు కడియాల చేయి పెట్టి
చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరు జార
వేమరు వాపోవు వాని వెడ్డు వెట్టరే
ఎప్పుడు వచ్చెనో మా యిల్లు చొచ్చి పెట్టెలోని
చెప్పరాని ఉంగరాల చేయిపెట్టి
అప్పడైన వేంకటాద్రి అసవాలకుడుగాన
తప్పకుండా పెట్టవాని తలకెత్తరే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి