ఇందరికి అభయంబు
హరి కాంభోజి రాగం, ఆది తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి:
ఇందరికి అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి
ఇందరికి అభయంబు లిచ్చు చేయి….
చరణం :
వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి
చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి
కలికియగు భూకాంత కౌగిలించిన చేయి
వలనైన కొనగోళ్ళ వాడి చేయి
..ఇందరికి అభయంబు లిచ్చు చేయి..
తనివోక బలి చేత దానమడిగిన చేయి
వొనరంగ భూదాన మొసగు చేయి
మొనసి జలనిధియమ్ము మొనకు తెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి
..ఇందరికి అభయంబు లిచ్చు చేయి…
పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డ చేయి
తిరువెంకటాచల ధీశుడై
తిరువెంకటాచల ధీశుడై మోక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి
ఇందరికి అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి
ఇందరికి అభయంబు లిచ్చు చేయి..3