24, నవంబర్ 2017, శుక్రవారం

Sita rave loka mata rave సీతారావే లోక మాతా రావే

సీతారావే లోకమాతా రావే
గానం: శ్రీమతి విద్యాభారతిగారు
Audio
సీతా రావే లోకమాత రావే
దివి నుండి భువికి దిగి వచ్చిన దయామయి రావే….2

నాగేటి చాలులో దొరికిన లక్ష్మీ రావే భాగ్యలక్ష్మీ రావే
జనకుని తపము పండగ వచ్చిన జానకి రావే..2...సీతా రావే…

కాంతులీను కమనీయ రూపముతో కదలీ రావమ్మా
కన్నుల తళ తళ వెలుగులు చిమ్ముచు వేగమే రావమ్మా...2.. .సీతా రావే…

మనసున నిన్నే తలచి తలచి భావించితినమ్మా
పద సరోజముల శరణమొసగి నను కాపాడవే అమ్మా...2…
సీతా రావే..2…
కృపామయి రావే...దయామయి రావే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి