24, నవంబర్ 2017, శుక్రవారం

Chandamama gobbilla pata చందమామా గొబ్బిళ్ళ పాట

Audio
చందమామా గొబ్బిళ్ళ పాట
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు


చందమామ చందమామ ఓ చందమామా
చందమామ చందమామ ఓ చందమామా

చందమామ కూతుళ్ళు నీలగిరి కన్యలు


నీలగిరి కన్యలకు నిత్యమల్లె తోట


నిత్యమల్లె తోటలో నిర్మల్ల బావి


నిర్మల్ల బావికి గిలకల్ల తాడు


గిలకల్ల తాడుకి బుడికి బుడికి చెంబు


బుడికి బుడికి చెంబంటే అందరికి మనస్సు


అందరికి మనసంటే నేనివ్వలేను


నేనివ్వ లేనంటే నా చెల్లి ఇచ్చు


నా చెల్లి నాకంటే కడు ముద్దురాలు.

చందమామ చందమామ ఓ చందమామా
చందమామ చందమామ ఓ చందమామా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి