21, జనవరి 2018, ఆదివారం

Balamu kulamu బలము కులము

బలము కులము
సావేరి రాగం, రూపక తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
త్యాగరాజస్వామి వారి కీర్తన
Audio
పల్లవి :
బలము కులము ఏల రామ భక్తి కారణము
బలము కులము ఏల రామ భక్తి కారణము
వెలయు సకల సిద్ధులెల్ల వెంట వచ్చు గాని మేను
బలము కులము ఏల రామ భక్తి కారణము
వెలయు సకల సిద్ధులెల్ల వెంట వచ్చు గాని మేను
బలము కులము ఏల రామ…...

చరణం :
నీట కాకి మీను మునుగ నిరతముదయ స్నానమా
తేటకనులు  కొంగ గూర్చ దేవ దేవ ధ్యానమా
…బలము కులము ఏల రామ భక్తి కారణము…..

పత్రములను మేయు మేక బలమైనయుపాసమా
చిత్ర పక్షులెగయ సూర్యా చంద్రులకు సామ్యమా
…బలము కులము ఏల రామ భక్తి కారణము….

వలచు త్యాగరాజవరదు వరభక్తులు సేయు భక్తి
చెలగు సకల జనుల కెల్ల చెల్లిన కాసౌనుగా

బలము కులము ఏల రామ భక్తి కారణము
వెలయు సకల సిద్ధు లెల్ల వెంట వచ్చు గాని మేను
బలము కులము ఏల రామ భక్తి కారణము
భక్తి కారణము భక్తి కారణము భక్తి కారణము

10, జనవరి 2018, బుధవారం

Barasala samdarbamuna బారసాల సందర్భమున

2.బారసాల సందర్భమున జరుపు  వేడుకలు
      నామకరణ (బారసాల) మహోత్సవం లో  డ్రస్సులు, సబ్బులు, నూనెసీసా,పౌడర్ పఫ్,తిలకము, కాటుక, ఇయర్ బడ్స్,పొత్తిగుడ్డలు, దుప్పటి,టవలు,బొమ్మలు,రబ్బరు షీటు,పౌడరుడబ్బా,హగ్గీసులు.
బంగారు వస్తువులు : --  మురుగులు,తోడాలు,గొళ్ళెపు గొలుసులు, లేక గాజులు,మొలపట్టి,గొలుసు.
వెండివి : - పౌడరు డబ్బా, పౌడరుపఫ్,గిన్నె,స్పూను,ఇలా ఎవరి ఆలోచన ప్రకారము వారుపెట్టి డెకరేషన్ చేయవచ్చును. పంతులుగారు చెప్పినపుడు బాబుకు ఇవ్వవలెను.
బాలింతకు చీర, జాకెట్టు , మోడిపుల్లలు, బెల్లము, నెయ్యి, వెల్లుల్లిపాయలు,ఒక ప్లేటులో సర్ది ఇవ్వవలెను.
పీటల మీద అల్లుడుకు బట్టలు పెట్టవలెను. వియ్యపురాళ్ళు పసుపు,కుంకుమలు ఒకరికి ఒకరు పెట్టుకొనవలెను.

8, జనవరి 2018, సోమవారం

తిరు వీధుల tiru veedhula

తిరు వీధుల
ఏకతాళము, శ్రీరాగము
గానం :శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio

పల్లవి :
తిరు వీధుల మెరసి దేవదేవుడు
గరిమల మించిన సింగారములతోడను

చరణం :
తిరు దండెలపై నేగి దేవుడిదే తొలినాడు
సిరుల రెండవనాడు శేషునిమీద
మురిపేన మూడోనాడు ముత్యాల పందిరి కింద
పొరి నాలుగో నాడు పూవు కోవిల లోన
…...తిరు వీధుల మెరసి దేవ దేవుడు……

గ్రక్కున ఐదవనాడు గరుడిని మీద
ఎక్కెను ఆరవనాడు ఏనుగు మీద
చొక్కమై ఏడవనాడు సూర్యా ప్రభలోనను
ఇక్కువ తేరును గుర్ర మేనిమిదో నాడు
….తిరు వీధుల మెరసి దేవదేవుడు…..

కనకపు టందలము  కదిసి తొమ్మిదో నాడు
పెనచి పదోనాడు  పెండ్లి పీట
ఎనసి శ్రీవేంకటేశు డింతి అలమేల్ మంగతో
వనితల నడుమను వాహనాల మీదను

తిరువీధిల మెరసి దేవదేవుడు
గరిమల మించిన సింగారములతోడను
తిరువీధిల మెరసి దేవదేవుడు
దేవదేవుడు….దేవదేవుడు….. 

5, జనవరి 2018, శుక్రవారం

Deena daya దీనదయా

దేవి నామావళి
దీనదయా పరిపూర్ణ
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
దీనదయా పరిపూర్ణ కటాక్షిణి కాంచి కామాక్షిణిి నమో నమో
దీనదయా పరిపూర్ణ కటాక్షిణి కాంచి కామాక్షిణిి నమో నమో
సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే నమో నమో
సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే నమో నమో

దీనదయా పరిపూర్ణ కటాక్షిణి కాంచి కామాక్షిణిి నమో నమో
దీనదయా పరిపూర్ణ కటాక్షిణి కాంచి కామాక్షిణిి నమో నమో
సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే నమో నమో
సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే నమో నమో

మాతంగ కన్యా మధురై మీనాక్షిణి పాండ్యరాజ పుత్రి…..
మాతంగ కన్యా మధురై మీనాక్షిణి పాండ్యరాజ పుత్రి…..
సుందర హృదయే సోమశేఖరి త్రిభువన జననీ మనోన్మణి.
సుందర హృదయే సోమశేఖరి త్రిభువన జననీ మనోన్మణి.

మాతంగ కన్యా మధురై మీనాక్షిణి పాండ్యరాజ పుత్రి…..
మాతంగ కన్యా మధురై మీనాక్షిణి పాండ్యరాజ పుత్రి…..
సుందర హృదయే సోమశేఖరి త్రిభువన జననీ మనోన్మణి.
సుందర హృదయే సోమశేఖరి త్రిభువన జననీ మనోన్మణి.

2, జనవరి 2018, మంగళవారం

Telusu kovalasina vishayalu తెలుసుకోవలసిన విషయాలు

1 .తెలుసుకోవలసిన విషయములు
  1.        పీటల మీద కూర్చోనునప్పుడు తాంబూలము చేతికి ఇచ్చి కూర్చొపెట్టాలి . ఆ తాంబూలములో రెండు పండ్లు వుండాలి. ముందుగా అక్షింతలు పీటలమీద చల్లాలి.
  2. హారతి పళ్ళెములో కుంది, వత్తులు,నూనె,తాంబూలము,అక్షింతలు,అగ్గిపెట్టె,కుంకుమభరిణి  ఉండవలెను.
  3. ఆడపిల్లలకు ఏదైనా సందర్భము ఉన్నప్పుడు కాళ్ళకు పసుపు రాయాలి.
  4. ఏ సందర్భములోనైనా ద్వారము లేనిచో ఒక గొలుసును ఇద్దరు  అటుఇటు  పట్టుకొని దాని క్రిందనుంచి వెళ్ళవచ్చును.
  5. ఆడపిల్లలకు ఏదైనా సందర్బమున్నప్పుడు కాళ్ళకు పసుపు రాయాలి.
  6. హారతి పట్టినపుడు ముందుగా దేవునికి అద్ది తరువాత పెద్దలకైనా,పిల్లలకైనా అద్దవలెను.
  7. జీవితములో ఒక్కరికి అయిన కన్యాదానము చేయుట మంచిది.
  8. తాంబులము ఎవరికైనా  ఇచ్చునపుడు ఆకునుగాని, పండుగాని తొడిమ మనవైపు ఉండవలెను.
  9. ఆడపిల్లలకు ఒడిబాలుగా పోసిన బియ్యము పొంగలి చేయాలి. ఇంకా ఎక్కువ ఉన్నయెడల
పులిహార కలుపుకోనవచ్చును.
  1. ఇంట్లో కడుపుచున్నవారు వున్నయెడల  మంచి గుమ్మడికాయ ఆ ఇంట్లో పగులగొట్టరు.

Siruta navvula vadu సిరుత నవ్వుల వాడు

సిరుత నవ్వుల వాడు
ఏకతాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా , /…..వీడు
వెరుపెరగడు సూడవే సిన్నెక్కా

చరణం :
పొలుసు మేని వాడు బోరవీపు వాడు
సెలసు మోరవాడు సిన్నెక్కా
కొలసుల వంకల కోరలతో భూమి
వెలసినాడు సూడవే సిన్నెక్కా
..‌‌‌‌….సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా , /……..వీడు
వెరుపెరగడు సూడవే సిన్నెక్కా.‌..‌‌‌…

మేటి కురచవాడు మెడమీది గొడ్డలి
సీటకాల వాడు సిన్నెక్కా
అడదాని బాసి అడవిలో రాకాశి
వేటలాడి జూడవే సిన్నెక్కా
..‌‌‌‌….సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా , /……...వీడు
వెరుపెరగడు సూడవే సిన్నెక్కా.‌..‌‌‌…

బింకపు మోతల పిల్లగోవి వాడు సింక
సూపుల వాడు సిన్నెక్కా
కొంకక కలికియై కొసరి కూడె నన్ను
వేంటేశుడు సూడవే సిన్నెక్కా
..‌‌‌‌….సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా , /…..వీడు
వెరుపెరగడు సూడవే సిన్నెక్కా.‌..‌‌‌…
వీడు వెరుపెరగడు సూడవే సిన్నెక్కా
వీడు వెరుపెరగడు సూడవే సిన్నెక్కా