సిరుత నవ్వుల వాడు
ఏకతాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా , /…..వీడు
వెరుపెరగడు సూడవే సిన్నెక్కా
చరణం :
పొలుసు మేని వాడు బోరవీపు వాడు
సెలసు మోరవాడు సిన్నెక్కా
కొలసుల వంకల కోరలతో భూమి
వెలసినాడు సూడవే సిన్నెక్కా
..….సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా , /……..వీడు
వెరుపెరగడు సూడవే సిన్నెక్కా...…
మేటి కురచవాడు మెడమీది గొడ్డలి
సీటకాల వాడు సిన్నెక్కా
అడదాని బాసి అడవిలో రాకాశి
వేటలాడి జూడవే సిన్నెక్కా
..….సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా , /……...వీడు
వెరుపెరగడు సూడవే సిన్నెక్కా...…
బింకపు మోతల పిల్లగోవి వాడు సింక
సూపుల వాడు సిన్నెక్కా
కొంకక కలికియై కొసరి కూడె నన్ను
వేంటేశుడు సూడవే సిన్నెక్కా
..….సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా , /…..వీడు
వెరుపెరగడు సూడవే సిన్నెక్కా...…
వీడు వెరుపెరగడు సూడవే సిన్నెక్కా
వీడు వెరుపెరగడు సూడవే సిన్నెక్కా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి