ఫాలనేత్రానల
శ్రీరాగం, తాళం ..ఖండగతి
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి:
ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా
కేళీ విహార లక్ష్మీనారసింహా
కేళీ విహార లక్ష్మీనారసింహా
చరణం :
ప్రళయ మారుత ఘోర భస్త్రీకా పూత్కార
లలిత నిశ్వాస డోలా రచనయా…
కుల శైల కుంభినీ కుముదహిత
రవి గగన
చలన విధి నిపుణ నిశ్చల నారసింహా
...ఫాలనేత్రానల…..
వివర ఘన వదన దుర్విధహాసన నిష్ఠ్యూత
లవదివ్య పరుష లాలాఘటనాయా…..
వివిధ జంతువ్రాత భువన మగ్నౌకరణ
నవ నవ ప్రియ గుణార్ణవ నారసింహ
....ఫాలనేత్రానల….
దారుణోజ్వల ధగద్జగిత దంష్ట్రాంనల
వికార స్పులింగ సంగ క్రీడయా….
వైరి దానవ ఘోర వంశ భస్మీకరణ
కారణ ప్రకట వేంకట నారసింహా
…...ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా
కేళీ విహార లక్ష్మీనారసింహా
కేళీ విహార లక్ష్మీనారసింహా
లక్ష్మీనారసింహా...లక్ష్మీనారసింహా…..లక్ష్మీనారసింహా…….