ఏమి సేతుర లింగా
నాదనామక్రియ రాగం, మిశ్ర చాపుతాళము
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీ గారు
Audio
పల్లవి :
ఏమి సేతుర లింగా ఏమి సేతురా
ఏమి సేతుర లింగా ఏమి సేతురా
చరణం :
గంగ ఉదకము తెచ్చినీకు లింగ పూజను చేదమంటే..ఏ..ఏ..ఏ.
గంగ ఉదకము తెచ్చినీకు లింగ పూజను చేదమంటే..
గంగలోన చేప కప్ప ఎంగిలంటున్నాయి లింగా
మహానుభావ మాలింగమూర్తి మాదేవశంభో..ఓ...ఓ...ఓ
ఏమి సేతుర లింగా ఏమి సేతురా
తుమ్మి పూలు తెచ్చి నీకు తుష్టుగా పూ చేదమంటే….ఏ..ఏ…ఏ...ఏ..
తుమ్మి పూలు తెచ్చి నీకు తుష్టుగా పూ చేదమంటే
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాయి లింగా…
మహానుభావ మాలింగమూర్తి మాదేవశంభో..ఓ...ఓ...ఓ
ఏమి సేతుర లింగా ఏమి సేతురా
అక్షయావుల పాడి తెచ్చి అర్పితము సేదమంటే….ఏ..ఏ..ఏ
అక్షయావుల పాడి తెచ్చి అర్పితము సేదమంటే
అక్షయావుల లేగదూడ ఎంగిలంటున్నాయి లింగా
మహానుభావ మాలింగమూర్తి మాదేవశంభో..ఓ...ఓ...ఓ
ఏమి సేతుర లింగా ఏమి సేతురా
ఏమి సేతుర లింగా ఏ..మి సేతురా…
ఏమి సేతుర లింగా ఏ..మి సేతురా….
ఏ..మి సేతురా…...ఏ..మి సేతురా….
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి