7, ఫిబ్రవరి 2018, బుధవారం

అలర చంచలమైన...alara chamchalamaina

అలర చంచలమైన
శ్రీరాగం,ఖండగతి తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
అలర చంచలమైన ఆత్మలందుండ నీ
కలవాటు జేసెనేే ఉయ్యాల
పలుమారు ఉచ్వాశ పవనమందుండ
నీ భావంబు దెలిపెనె ఉయ్యాలా….
ఉయ్యాల….ఉయ్యాల….
ఉయ్యాలా….ఉయ్యాలా…..

ఉదయాస్త శైలంబు లొనర కంభములైన
ఉడు మండలము మోచె ఉయ్యాల
అదన ఆకాశ పదము అడ్డదూలంబైన
అఖిలంబు నిండె నీ ఉయ్యాలా...
ఉయ్యాల….ఉయ్యాల…
ఉయ్యాలా….ఉయ్యాలా….

పదిలముగా వేదములు బంగారు చేరులై
పట్టి వెరపై తోచె ఉయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగులవర్ణింప నరుదాయె ఉయ్యాలా….
ఉయ్యాల….ఉయ్యాల….
ఉయ్యాలా….ఉయ్యాలా……

కమలాసనాదులకు కన్నులా పండుగై
గణుతింప నరుదాయె ఉయ్యాల
కమనీయ మూర్తి వేంకట శైలపతి నీకు
కడువేడుకై ఉండె ఉయ్యాలా….
ఉయ్యాలా…..ఉయ్యాలా…
ఉయ్యాలా….ఉయ్యాలా….
ఉయ్యాలా...ఉయ్యాలా….

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి