అన్నమయ్యకు మంగళం
సురటి రాగం
పల్లవి :
అన్నమయ్యకు మంగళం
హరి భక్తునకు మంగళం
చరణం :
చెన్ను మీరగను వేలకీర్తనల
భక్తి మీరగను గానము చేసిన
అన్నమయ్యకు మంగళం
హరి భక్తునకు మంగళం
భక్తి ఙ్ఞాన వైరాగ్య సంపదల
పంచిపెట్టుటకు అవతరించిన
అన్నమయ్యకు మంగళం
హరి భక్తునకు మంగళం
అలమేల్మంగకు ముద్దుబిడ్డడు
పదకవితా పితామహుడు (శ్రీ)
అన్నమయ్యకు మంగళం
హరి భక్తునకు మంగళం
వేంకటేశ్వరుని పాదము లీడక
పదములు పాడిన భక్తాగ్రేసరుడు
అన్నమయ్యకు మంగళం
హరి భక్తునకు మంగళం
భ్రమర కీటక న్యాయము వోలె
శ్రీనివాసునిలో లీనమైన
అన్నమయ్యకు మంగళం
హరి భక్తునకు మంగళం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి