అంతయు నీవే హరి పుండరీకాక్ష
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
అంతయు నీవే హరి పుండరీ కాక్ష
చెంత నాకు నీవే శ్రీ రఘురామా
కులమును నీవే గోవిందుడా నా
కలమియు నీవే కరుణానిధి
తలపును నీవే ధరణీధరా నా
నెలవును నీవే నీరజనాభా..
తనవును నీవే దామోదరా నా
మనికియు నీవే మధుసూదనా
వినికియు నీవే విట్టలుడా నా
వెనక ముందు నీవే విష్ణుదేవుడా
పుట్టుగు నీవే పురుషోత్తమా కొన
నట్ట నడుము నీవే నారాయణా
యిట్టె శ్రీవెంకటేశ్వరుడా నాకు
నెట్టన గతి యింక నీవే నీవే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి