21, మే 2018, సోమవారం

Appani varaprasadi అప్పని వరప్రసాది

అప్పని వరప్రసాది అన్నమయ్య
గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
అప్పని వరప్రసాది అన్నమయ్య
అప్పసము మాకె కలఁడన్నమయ్య

అంతటికి ఏలికైన ఆదినారాయణు తన
అంతరంగాన నిలిపిన అన్నమయ్య
సంతసాన చెలువొందె సనకాస నంద నాదు
లంతటివాఁడు తాళ్ళపాక అన్నమయ్య

బిరుదు టెక్కములుగా పెక్కు సంకీర్తనములు
హరిమీద విన్నవించె నన్నమయ్య
విరివిగలిగి నట్టి వేదముల అర్ధమెల్ల
అరసి తెలిపినాడు అన్నమయ్య

అందమైన రామానుజ ఆచార్యమతమును
అందుకొని నిలచినాఁడు అన్నమయ్య
విందువలె మాకును శ్రీ వెంకటనాథునినిచ్చె
అందరిలో తాళ్ళపాక అన్నమయ్య

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి