19, జులై 2018, గురువారం

Sri rama Krishna nama gaana ీ రామ క్రిష్ణ నామ గాన

శ్రీ రామ క్రిష్ణ నామ గాన
కళ్యాణిరాగం….ఆదితాళం/ఏకతాళం
స్వర రచన : శ్రీమతి వేమూరి సరోజిని శాస్త్రిగారు
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
మధ్యమం….
Audio
పల్లవి :
శ్రీ రామ క్రిష్ణ నామ గాన భజన చేయరా
పాపాలు వేనవేలు పారిపోవురా
హరి పారిపోవురా….శ్రీహరి పారిపోవురా

చరణం :
శబరి నీకు ఏమి ఇచ్చి వేడుకున్నదో
గుహుడు నిన్ను వేడినంత దాస్యమిస్తివి
రామయ్య మాకు ఏమి ఇచ్చెదవో తెలియదాయె
ఏ జన్మకైన నీదు భజన మరువలేమురా శ్రీ
…….రామ క్రిష్ణ నామ గాన ….

ద్రౌపదేమి ఇచ్చి నిన్ను పిలిచియున్నదో
కేకలేసి పిలిచినంత కోకలిస్తివి
క్రిష్ణయ్య మాకు ఏమి ఇచ్చెదవో తెలియదాయె
ఏ జన్మకైన నీదు భజన మరువలేమురా శ్రీ
…….రామ క్రిష్ణ నామ గాన ….

చెఱసాలయందు రామదాసు ఏమి తలచెనో
మొఱ విన్న నీవు చెఱసాలకు వచ్చితివి
రామయ్య మాకు ఏమి ఇచ్చెదవో తెలియదాయె
ఏ జన్మకైన నీదు భజన మరువలేమురా శ్రీ
…….రామ క్రిష్ణ నామ గాన ….

గజరాజు మొసలి బాధ  నీకు నిజము తెలిపెనా
పరుగు పరుగున వచ్చి ఆదుకొంటివి
క్రిష్ణయ్య మాకు ఏమి ఇచ్చెదవో తెలియదాయె
ఏ జన్మకైన నీదు భజన మరువలేమురా శ్రీ
…….రామ క్రిష్ణ నామ గాన ….
హరి పారిపోవురా...శ్రీహరి పారిపోవురా….

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి