గిరి తనయ
హంసధ్వని రాగం , ఏకతాళం
స్వర రచన : శ్రీమతి వేమూరి సరోజిని శాస్త్రీగారు
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
గిరి తనయ ప్రియ సూన
కరిముఖ గణనాయక దేవ...2
మార వైరి వర తనయ దయనేలరా గణరాయ
మార వైరి వర తనయ మము దయనేలరా గణరాయ
…….గిరి తనయ ప్రియ సూన
కరిముఖ గణనాయక దేవ…...
చరణం :
నీ నామం ఏ మరక …..
నిరతము దలతుము భవనాశ
దీనపోష ఫణిభూష ….
ధర తొలి పూజిత విఘ్నేశా
…….గిరి తనయ ప్రియ సూన
కరిముఖ గణనాయక దేవ……
మూషిక వాహన ….
మునిజన సన్నుత నుత వరద
శ్రీ తాడ్బండుధీశ్వర …..
సమాజ సేవిత సురనాధా/
సిద్ది బుద్ధి గణనాధ ….
శ్రీకర శుభకర సురనాధా
…….గిరి తనయ ప్రియ సూన కరిముఖ గణనాయక దేవ...2
…..కరిముఖ గణనాయక దేవ
కరిముఖ గణనాయక దేవ…….
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి