12, ఆగస్టు 2018, ఆదివారం

Padudama swechageetam పాడుదమా

పాడుదమా స్వేచ్ఛా గీతం
గానం : రెడ్డి ప్రసాద్
Audio
పల్లవి :
పాడుదమా స్వేచ్ఛాగీతం…..
ఎగరేయుదమా జాతి పతాకం...మన జాతీ పతాకం...
దిగంతాల నినదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతిగౌరవం
….పాడుదమా స్వేచ్ఛాగీతం……

చరణం :
జలియన్ వాలా బాగ్ దురంతపు నెత్తుటిదారల నత్తుకొని ...నెత్తుటిదారల నత్తుకొని
ఉరికొయ్యల చెరసాలల గోడలు దారుణాలు తలకెత్తుకొని….దారుణాలు తలకెత్తుకొని
పోగలిగిన కాలం ఆ...ఆ… పోరాడిన కాలం ఓ….ఓ…..
మరి మరి ఒకపరి తలుచుకొని మృతవీరుల నెదనిది కలుసుకొని
…...పాడుదమా...స్వేచ్ఛాగీతం……,

వందేమాతరమని నినదించిన వీరుల శౌర్యం నందుకొని….వీరుల శౌర్యం నందుకొని
స్వాతంత్ర్యం నా జన్మహక్కని గర్జించిన గళమందుకొని ….గర్జించిన గళమందుకొని
పోరాట బలం...ఆ...ఆ…. స్వాతంత్ర్య ఫలం ఓ….ఓ…
కలకాలం కాపాడుకొని కడుగర్వంగా కొనియాడుకొని
…...పాడుదమా...స్వేచ్ఛాగీతం……,

మన్యెం గుండెలు మంటై రగిలిన విప్లవ జ్యోతియ స్పూర్తియని …..విప్లవ జ్యోతియ స్పూర్తియని
గుండెకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింహముల తెగువగని….తెలుగు సింహముల తెగువగని
చీకటి గుండెలు ఆ….ఆ…..బాకై మెరసిన ఓ….ఓ….
గరిమెళ్ళను గురుతుంచుకొని మన తెలుగు తేజమును నింపుకొని
…...పాడుదమా...స్వేచ్ఛాగీతం……,

జనగణమనమున జాగృతి నింపిన ఝండా గాధలు చెప్పుకొని ….ఝండా గాధలు చెప్పుకొని
జయహే జయ జయహే జయజననీ జయగీతమ్ములు పాడుకొని …..జయగీతమ్ములు పాడుకొని
పావన చరితం ఆ….ఆ….పరిమళ భరితం ఓ….ఓ…
అఖండ భారత ఖండమని అది అక్షయ అమృత భాండమనీ..
…..పాడుదమా...స్వేచ్ఛాగీతం……,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి