26, సెప్టెంబర్ 2018, బుధవారం

Vanamali vasudeva వనమాలి వాసుదేవ

వనమాలి వాసుదేవ
గానం: కావ్యా,విద్యాగారు
Audio
వనమాలి వాసుదేవ మన మోహన రాధారమణ
శశివదనా సరసిజ నయనా జగన్మోహన రాధారమణ

పాల కడలి శయనా దేవా పరంధామా రాధారమణ
దీనభక్త ఆర్తిహరుడా శ్రీరంగ రాధారమణ

వెన్నతిన్న మాయా మాధవ కన్నా మా రాధారమణ
కోరిన వరమొసగే స్వామి శ్రీరంగ రాధారమణ

…….వనమాలి వాసుదేవ మన మోహన రాధారమణ
శశివదనా సరసిజ నయనా జగన్మోహనా రాధారమణ.‌‌‌‌…..

రాధారమణ…..రాధారమణ ,రాధారమణ…..రాధారమణ,రాధారమణ…..రాధారమణ,రాధారమణ…..రాధారమణ…..,.................................

Srikrishna yanu శ్రీకృష్ణాయను నామమంత్ర

శ్రీకృష్ణాయను నామమంత్ర
రాగం : మిశ్ర శంకరాభరణం, ఆది/ఏక తాళం
రచన :శ్రీ కైవార అమర నారేయణ
సంగీతం : బాలమురళీ కృష్ణ గారు
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
కృష్ణా….శ్రీ కృష్ణా…….అ...అ…...

పల్లవి:
శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్దించుట నాకెన్నటికో
శ్రీగురు పాదాబ్జంబులు మదిలో స్ధిరముగ నిలిచేదెన్నటికో
…..శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్దించుట నాకెన్నటికో……………

చరణం :
మరువక మాధవు మహిమలు పొగడే మర్మము తెలిసేదెన్నటికో
హరి హరి హరియని హరినామామృత పానము చేసేదెన్నటికో
…..శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్దించుట నాకెన్నటికో…..

శ్రీరఘురాముని శుభచరితమ్ములు భజియించుట నాకెన్నటికో
సద్గురు రాయని సన్నిధిలో  పరిచారకుడయ్యేదెన్నటికో
…..…..శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్దించుట నాకెన్నటికో…..

కమలాక్షుని నాకన్నులు చల్లగా గని సేవించేదెన్నటికో
లక్షణముగ శ్రీలక్ష్మీరమణుని దాసుడనయ్యేదెన్నటికో
….శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్దించుట నాకెన్నటికో…..

పంచాక్షరీ మంత్రము మదిలో పఠియించుట నాకెన్నటికో
ఆదిమూర్తి శ్రీ అమర నారేయణ  భక్తుడనయ్యేదెన్నటికో
…...శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్దించుట నాకెన్నటికో…..

17, సెప్టెంబర్ 2018, సోమవారం

Sri sakala gananadhipa శ్రీ సకల గణాధిప

శ్రీ సకల గణాధిప
అరభిరాగం,ఆదితాళం
సంగీతం : బాలమురళీ కృష్ణగారు
రచన : శ్రీ స్వాతి తిరునాళ్
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
శ్రీ…… సకల గణాధిప పాలయ మాం అనిశం అనిశం..

శ్రీ …...సకల గణాధిప పాలయ మాం అనిశం వరసిద్ది వినాయక భక్త జనాళిపోష వరచంద్రమౌళి సుత..1,2,3

శ్రీ…… సకల గణాధిప పాలయ మాం అనిశం అనిశం

అనుపల్లవి :
దాసార్చిత పాద ...2
భాసురాంగ కరుణా సముద్ర
వరవాయుపుత్ర హనుమంత వరప్రద …2

దాసార్చిత పాద భాసురాంగ కరుణా,సముద్ర వరవాయుపుత్ర హనుమంత వరప్రద

శ్రీ...సకల శివంకర మారుతి మాం అవతు వరరామ సునామ సుధా రసపాన దీనజన భక్త భయాపహ….2,3

శ్రీ….సకల గణాధిప పాలయమాం అనిశం అనిశం

చరణం :
నంద నందన వందనమస్తుతే కుందరదన ముకుంద మురహర…2

మందరోద్ధర వందిత బుధజన
బృందహృదయ నివాస సుందర...2

మందహసిత వదనారవింద
మకరందపాన సంగీత సుధాకర...2

శ్రీ ….సకల కళా పరిపూర్ణ దయాశరదే వరదా భయదాయక మామవ మంగళాంగ మురళీరవ మోహన...2,3

శ్రీ…… సకల గణాధిప పాలయ మాం అనిశం అనిశం..

8, సెప్టెంబర్ 2018, శనివారం

Jaganmohanakara జగన్మోహనాకారా

జగన్మోహనాకారా
మోహనరాగం,మిశ్రచాపు తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
జగన్మోహనాకారా……
జగన్మోహనాకారా చతురుడవు పురుషోత్తముడవు
వెగటు నా సోదంబు ఇది నీవెలితో ….నావెలితో
జగన్మోహనాకారా……జగన్మోహనాకారా..‌‌‌…...

చరణం:
ఎన్ని మారులు సేవించిన కన్నులూ తనియవు
విన్న నీ కథామృతమున వీనులూ తనియవు
సన్నిధిని మిమ్ము నుతియించి సరుస జిహ్వయు తనియదు
విన్న కన్నది కాదు ఇది నావెలితో…
విన్న కన్నది కాదు ఇది నావెలితో ...నీ వెలితో
….‌జగన్మోహనాకారా…

కడగి నీ ప్రసాదమే కొని కాయమూ తనియదు
బడి ప్రదక్షణములూ సేసి పాదములు నివి తనియవు
నుడివి సాష్టాంగంబు చేసి నుదురునూ తనియదు
వెడగు దన మిది గలిగెనిది నావెలితో….
వెడగు దన మిది గలిగెనిది నావెలితో నీవెలితో
…..జగన్మోహనాకారా...‌.

చెలగి నిను నే పూజించి చేతులు తనియవు
చెలువు సింగారంబు తలచి చిత్తమూ తనియదు
అలరి శ్రీ వేంకటగిరీశ్వర ఆత్మ నను మోహింపజేసితి
వెలయ నిన్నియు దేరె మును నీ వెలితో...
వెలయ నిన్నియు దేరె మును నీ వెలితో నావెలితో...


జగన్మోహనాకారా చతురుడవు పురుషోత్తముడవు
వెగటు నా సోదంబు ఇది నీవెలితో….నావెలితో
జగన్మోహనాకారా……జగన్మోహనాకారా…..
…….జగన్మోహనాకారా……..

2, సెప్టెంబర్ 2018, ఆదివారం

Ooregavaiah Sri venkateswara ఊరేగవయ్య శ్రీవేంకటేశ్వరా

ఊరేగవయ్య శ్రీవేంకటేశ్వరా
కానడరాగం, ఆది తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు

ఊరేగవయ్య శ్రీవేంకటేశ్వరా
శ్రీలక్ష్మీ సమేతుడై పూల పల్లకిలోన…..
…..ఊరేగవయ్య శ్రీవేంకటేశ్వరా….

చరణం:
జాలువారు చిరునగవుల శ్రీరాసలీలల
కౌగిళ్ళ దేవేరుల గిలిగింతల డోలల
ఆనురాగము పరిమళించు ఆమని శుభవేళల
వేదమైన వేంకటాద్రి తిరువీధుల
…ఊరేగవయ్య శ్రీవేంకటేశ్వరా…..

భక్తి ఉన్న ప్రతి మనస్సు ఒక పువ్వు కాగా
రక్తి మీర శ్రీ పదముల ముదమారగ చేరగా
కృపగల నీ కనులకవి పూపల్లకిగా వెలుగ
శ్రీనివాస చిద్విలాస ప్రేమవీధుల
…ఊరేగవయ్య శ్రీవేంకటేశ్వరా…

ఎన్నడైనా తనివారని ఈ కోరికలలో
మరల మరల మా కోసం అలరారు కరుణతో
శరణార్ధుల దరి చేర్చే చక్కని సంబరములతో
దేవ దేవ దివ్య భావ విశ్వవీధుల
…..ఊరేగవయ్య శ్రీవేంకటేశ్వరా….

Audio