2, సెప్టెంబర్ 2018, ఆదివారం

Ooregavaiah Sri venkateswara ఊరేగవయ్య శ్రీవేంకటేశ్వరా

ఊరేగవయ్య శ్రీవేంకటేశ్వరా
కానడరాగం, ఆది తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు

ఊరేగవయ్య శ్రీవేంకటేశ్వరా
శ్రీలక్ష్మీ సమేతుడై పూల పల్లకిలోన…..
…..ఊరేగవయ్య శ్రీవేంకటేశ్వరా….

చరణం:
జాలువారు చిరునగవుల శ్రీరాసలీలల
కౌగిళ్ళ దేవేరుల గిలిగింతల డోలల
ఆనురాగము పరిమళించు ఆమని శుభవేళల
వేదమైన వేంకటాద్రి తిరువీధుల
…ఊరేగవయ్య శ్రీవేంకటేశ్వరా…..

భక్తి ఉన్న ప్రతి మనస్సు ఒక పువ్వు కాగా
రక్తి మీర శ్రీ పదముల ముదమారగ చేరగా
కృపగల నీ కనులకవి పూపల్లకిగా వెలుగ
శ్రీనివాస చిద్విలాస ప్రేమవీధుల
…ఊరేగవయ్య శ్రీవేంకటేశ్వరా…

ఎన్నడైనా తనివారని ఈ కోరికలలో
మరల మరల మా కోసం అలరారు కరుణతో
శరణార్ధుల దరి చేర్చే చక్కని సంబరములతో
దేవ దేవ దివ్య భావ విశ్వవీధుల
…..ఊరేగవయ్య శ్రీవేంకటేశ్వరా….

Audio

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి