జగన్మోహనాకారా
మోహనరాగం,మిశ్రచాపు తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
జగన్మోహనాకారా……
జగన్మోహనాకారా చతురుడవు పురుషోత్తముడవు
వెగటు నా సోదంబు ఇది నీవెలితో ….నావెలితో
జగన్మోహనాకారా……జగన్మోహనాకారా..…...
చరణం:
ఎన్ని మారులు సేవించిన కన్నులూ తనియవు
విన్న నీ కథామృతమున వీనులూ తనియవు
సన్నిధిని మిమ్ము నుతియించి సరుస జిహ్వయు తనియదు
విన్న కన్నది కాదు ఇది నావెలితో…
విన్న కన్నది కాదు ఇది నావెలితో ...నీ వెలితో
….జగన్మోహనాకారా…
కడగి నీ ప్రసాదమే కొని కాయమూ తనియదు
బడి ప్రదక్షణములూ సేసి పాదములు నివి తనియవు
నుడివి సాష్టాంగంబు చేసి నుదురునూ తనియదు
వెడగు దన మిది గలిగెనిది నావెలితో….
వెడగు దన మిది గలిగెనిది నావెలితో నీవెలితో
…..జగన్మోహనాకారా....
చెలగి నిను నే పూజించి చేతులు తనియవు
చెలువు సింగారంబు తలచి చిత్తమూ తనియదు
అలరి శ్రీ వేంకటగిరీశ్వర ఆత్మ నను మోహింపజేసితి
వెలయ నిన్నియు దేరె మును నీ వెలితో...
వెలయ నిన్నియు దేరె మును నీ వెలితో నావెలితో...
జగన్మోహనాకారా చతురుడవు పురుషోత్తముడవు
వెగటు నా సోదంబు ఇది నీవెలితో….నావెలితో
జగన్మోహనాకారా……జగన్మోహనాకారా…..
…….జగన్మోహనాకారా……..
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి