26, సెప్టెంబర్ 2018, బుధవారం

Srikrishna yanu శ్రీకృష్ణాయను నామమంత్ర

శ్రీకృష్ణాయను నామమంత్ర
రాగం : మిశ్ర శంకరాభరణం, ఆది/ఏక తాళం
రచన :శ్రీ కైవార అమర నారేయణ
సంగీతం : బాలమురళీ కృష్ణ గారు
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
కృష్ణా….శ్రీ కృష్ణా…….అ...అ…...

పల్లవి:
శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్దించుట నాకెన్నటికో
శ్రీగురు పాదాబ్జంబులు మదిలో స్ధిరముగ నిలిచేదెన్నటికో
…..శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్దించుట నాకెన్నటికో……………

చరణం :
మరువక మాధవు మహిమలు పొగడే మర్మము తెలిసేదెన్నటికో
హరి హరి హరియని హరినామామృత పానము చేసేదెన్నటికో
…..శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్దించుట నాకెన్నటికో…..

శ్రీరఘురాముని శుభచరితమ్ములు భజియించుట నాకెన్నటికో
సద్గురు రాయని సన్నిధిలో  పరిచారకుడయ్యేదెన్నటికో
…..…..శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్దించుట నాకెన్నటికో…..

కమలాక్షుని నాకన్నులు చల్లగా గని సేవించేదెన్నటికో
లక్షణముగ శ్రీలక్ష్మీరమణుని దాసుడనయ్యేదెన్నటికో
….శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్దించుట నాకెన్నటికో…..

పంచాక్షరీ మంత్రము మదిలో పఠియించుట నాకెన్నటికో
ఆదిమూర్తి శ్రీ అమర నారేయణ  భక్తుడనయ్యేదెన్నటికో
…...శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్దించుట నాకెన్నటికో…..

1 కామెంట్‌: