నారాయణాచ్యుతానంత
తాళం : ఖండగతి , రాగం : మాయమాళవ
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
నారాయణాచ్యుతానంత గోవింద హరి
సారముగ నీకునే శరణంటిని
సారముగ నీకునే శరణంటిని
చరణం :
చలువయును వేడియును నటల సంసారంబు
తొలకు సుఖమొకవేళ దుఃఖమొకవేళ
ఫలములివె యీ రెండు పాపములు పుణ్యములు
పులుపు తీపిని గలిపి భుజియించినట్లు
…..నారాయణాచ్యుతానంత గోవింద హరి…..సారముగ నీకునే శరణంటిని
సారముగ నీకునే శరణంటిని……
పగలు రాత్రుల రీతి బహుజన్మ మరణాలు
తగు మేను పొడచూపు తనుతానె తొలుగు
నగయించు నొకవేళ నలగించు నొకవేళ
వొగరు కారపు విడెము ఊబ్బించినట్లు
…..నారాయణాచ్యుతానంత గోవింద హరి….సారముగ నీకునే శరణంటిని….
సారముగ నీకునే శరణంటిని……
యిహము పరముల వలనె యెదిటి కల్లయు నిజము
విహరించు భ్రాంతియును విభ్రాంతియును మదిని
సహజ శ్రీ వేంకటేశ్వర నన్ను కరుణించ
బహువిధంబుల నన్ను పాలించవే
…...నారాయణాచ్యుతానంత గోవింద హరి సారముగ నీకునే శరణంటిని ….
సారముగ నీకునే శరణంటిని
శరణంటిని...శరణంటిని
శరణంటిని...శరణంటిని……...