శారదా విశారదా
హంసధ్వని రాగం , …..తిశ్రగతి...ఆదితాళం
గానం : మొక్కరాల కామేశ్వీగారు
పల్లవి :
శారదా విశారదా….
శారదా విశారదా సకల కళా నీరదా సుజన జన మనోరధా సుగుణ భూషితావరదా
...శారదా విశారదా…..
చరణం:
లలిత కళా విలాసిని
లలిత లలిత పద్మపాణి
వారిజభవు రాణి నీలవేణి వాణి కలభాషిణి…...
…...శారదా విశారదా సకల కళా నీరదా
సుజన జన మనోరధా సుగుణ భూషితా వరదా
...శారదా విశారదా…..
అంభోరుహ నేత్రి సరళా
గంభీర సుమధుర గాత్రి …...
వీణా పుస్తక పాణి
వినుత జ్ఞానప్రదాయిని
…..శారదా విశారదా సకల కళా నీరదా సుజనజన మనోరధా సుగుణ భూషితా వరదా
...శారదా విశారదా…..
శారదా విశారదా…..
శారదా... విశారదా......
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి