28, జనవరి 2019, సోమవారం

Vinayamunanu వినయమునను కౌశికుని

వినయమునను కౌశికుని
రాగం : సౌరాష్ట్ర ...తాళం : మిశ్రచాపు
త్యాగరాజ స్వామి వారి దివ్యనామ సంకీర్తన
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు.
Audio
పల్లవి :
వినయమునను కౌశికుని వెంట
జని నాంగ్రులను జూచేదెన్నటికో
అందు వెనుక రాతిని నాతి చేసిన
చరణములను జూచేదెన్నటికో

చరణం :
ఘనమైన శివుని చాపమును
దృంచిన పాదమును జూచేదెన్నటికో
ఆ జనకరాజు పాల కడిగిన యా
కాళ్ళను జూచేదెన్నటికో

చనువున సీతకు బొట్టు కట్టిన
కరమును జూచేదెన్నటికో
కోపమున భృగుసుతు చాప
బలమందుకొన్న బాహువు జూచేదెన్నటికో

కనికరమున విభీషణుని
చూచిన కన్నులను జూచేదెన్నటికో
రావణుని గొట్టి పెద్ద కపుల
లేవ జూచే దృష్టిని జూచేదెన్నటికో

ఆగమ వినుతుని ఆనందకందుని
బాగా జూచేదెన్నడో
పరమ భాగవతా ప్రియుని నిర్వికారుని
రాక జూచేదెన్నడో

సాగర శయనుని కరుణా జలానిధిని
వేగ జూచేదెన్నడో
వరత్యాగరాజాది దేవతలు
పొగడుకొనేలాగు జూచేదెన్నడో
…….రామా ఎన్నడో...రామా ఎన్నడో ...రామా ఎన్నడో…..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి