పాహి రామచంద్ర రాఘవ
త్యాగరాజస్వామి కృతులు
యదుకుల కాంభోజి రాగం , రూపక తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
పాహి రామచంద్ర రాఘవ హరే మాం
పాహి రామచంద్ర రాఘవ
….పాహిరామ...పాహిరామ….
చరణం :
జనక సుతా రమణ కావవే గతీ నీవు
గనుక నన్ను వేగ బ్రోవవే
…..పాహి రామ...పాహిరామ….
కష్టములను తీర్పమంటిని నీవు
నాకిష్ట దైవమనుకొంటిని
…..పాహి రామ...పాహిరామ…..
శోధనలకు నేను పాత్రమా రామ
యశో ధనులకు ఇది పాత్రమా
….పాహి రామ….పాహిరామ…..
అంబుజాక్ష వేగ చూడరా నీ కటాక్షంబు
లేని జన్మమేలరా
…….పాహి రామ….పాహి రామ…..
రాజ రాజ పూజిత ప్రభో హరే త్యాగ
రాజ రాజ రాఘవ ప్రభో
…..పాహి రామచంద్ర రాఘవ హరే మాం
పాహి రామచంద్ర రాఘవ
పాహి రామ…...4
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి